Asianet News TeluguAsianet News Telugu

నయీం ప్రధాన అనుచరుడు శేషన్నపై పీడీయాక్ట్...

కరుడు గట్టిన నేరస్తుడు నయీం ప్రధాన అనుచరుడు శేషన్న మీద హైదరాబాద్ పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 

PD act on Naeem's main follower Sheshanna, telangana
Author
First Published Dec 30, 2022, 7:50 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు నయీం అనుచరుడు శేషన్నపై గురువారం మీద పీడీయాక్ట్ పెట్టారు. శేషన్న కరుడుగట్టిన నేరస్తుడైన నయీంకు ముఖ్య అనుచరుడు. శేషన్నను.. పెద్దన్న అలియాస్ ముద్దునూరి శేషయ్య అని కూడా పిలుస్తారు. గురువారం హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ శేషన్న మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఆదేశారు జారీ చేశారు. నయీం అనుచరుడిగా శేషన్న అనేక నేరాల్లో నిందితుడు. 11 తీవ్రమైన నేరాల్లో శేషన్న నిందితుడు. ఈ పదకొండు నేరాల్లో 2004 నుంచి చేసిన దోపిడీ కేసులతో పాటు కొన్ని దారుణ హత్యలు కూడా ఉన్నాయి. 

శేషన్న జనాల్ని భయపెడుతూ కమీషన్లు తీసుకునేవారు. దేశవాళీ తుపాకులు వాడేవాడు. వాటితోనే పలు నేరాలు చేసేవాడు. అతని మీద అనేక కేసులు నమోదయ్యాయి. అయితే, ఎప్పుడూ పోలీసులకు చిక్కలేదు. ఈ పాత నేరాల కిందనే సెప్టెంబర్ 9న గోల్కొండ పోలీసులు శేషన్నను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో శేషన్న అలియాస్ పెద్దన్న అలియాస్ ముద్దునూరి శేషయ్య దగ్గర దేశవాళీ తుపాకీ, అయిదు బుల్లెట్లు దొరికాయి. అతను గతంలో పాల్పడ్డ నేరాలు మామూలువి కావని.. వాటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని శేషన్న మీద పీడీయాక్టు ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్ : బాలానగర్‌లో తల్లీ, ముగ్గురు పిల్లల అదృశ్యం.. రంగంలోకి పోలీసులు

ఇదిలా ఉండగా, 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యకేసులో నయీం ముఠాకు చెందిన శేషన్న అలియాస్ శేషయ్యను ఒంగోలు పోలీసులు డిసెంబర్ 2న విచారణకు తీసుకువచ్చారు. ప్రకాశం జిల్లా  సింగరాయకొండలో మన్నం దేవీప్రసాద్ అలియాస్ మన్నం ప్రసాద్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగి పదిహేడేళ్లు అవుతుంది. ఈ హత్య కేసులో నిందితుడిగా  ఉన్న నయిమ్ ముఠాకు చెందిన శేషన్నను విచారణ నిమిత్తం పోలీసులు ఒంగోలుకు తరలించారు. ఈ నిందితుడు అనధికారికంగా తన వద్ద ఆయుధాలను ఉంచుకున్నాడు అని.. సమాచారంతోగో ల్కొండ పోలీస్ స్టేషన్ లో రెండు నెలల క్రితం కేసు నమోదయింది.

ఈ మేరకు గోల్కొండ పోలీసులు శేషన్నను అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. శేషన్న విచారణలో 2005లో సింగరాయకొండలో జరిగిన బ్యాంకు ఉద్యోగి దేవీప్రసాద్ హత్య కేసులో అతనికి ప్రమేయం ఉన్నట్లుగా తెలిసింది. దీంతో ఒంగోలు పోలీసులు కోర్టు అనుమతితో శేషన్నను జైలు నుంచి సింగరాయకొండకు తరలించారు. ఈ కేసు నేపథ్యంలో శేషన్నను మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. 

తెలంగాణలో నయీమ్ ముఠా చేసిన అకృత్యాలు, అరాచకాలపై విచారణ  చేపట్టారు. నయీమ్ ముఠాలో శేషన్నకీలకంగా ఉండేవాడు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత మన్నం ప్రసాద్ హత్య విషయం కూడా వెలుగు చూసింది. ఈ హత్య కేసులో నేరుగా పాల్గొన్న నిందితుల్లో ఒకరైన కె. విజయ్ కుమార్ ఇప్పటికే మృతి చెందినట్లు  తెలిసింది. కుంట్లా సత్యనారాయణ, కుంట్లా యాదగిరిలు శేషన్న సహ నిందితులుగా ఉన్నారు. వీరిద్దరి ఆచూకీ ఇంకా తెలియలేదు. 17 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో మరిన్ని వివరాలు శేషన్న నోరు విప్పితే బయట పడే అవకాశాలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios