హైదరాబాద్ బాలానగర్లో తల్లి , ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరి కోసం గాలిస్తున్నారు. 

హైదరాబాద్ బాలానగర్లో తల్లి , ముగ్గురు పిల్లలు అదృశ్యం కావడం కలకలం రేపింది. సంగారెడ్డి చెందిన మాధవి అనే వివాహిత నర్సాపూర్ క్రాస్‌రోడ్‌కి తన ముగ్గురు పిల్లలతో బస్‌లో వచ్చింది. అనంతరం ఈ నెల 23న యాదాద్రికి వెళ్లి అక్కడి నుంచి పిల్లలతో కలిసి ఇంటికెళ్లింది మాధవి. అయితే నర్సాపూర్ క్రాస్‌లో పిల్లలు, మాధవి బస్ దిగినట్లుగా అల్లుడు రమేశ్‌కి సమాచారం అందజేసింది అత్త. ఈ క్రమంలో నిన్నటి నుంచి మాధవి, ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని బాలానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని మాధవి, పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred