100 ఏళ్లు పూర్తి చేసుకున్న వర్సిటీపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు
100 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీకి వందనాలు సమర్పిస్తున్నట్లు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎందరో గొప్పవ్యక్తులను జాతికి అందించిన గొప్ప యూనివర్సిటీ ఓయూ అని ఓ ప్రకటనలో తెలిపారు.
బ్రిటీష్ విద్యావేత్త విల్ఫ్రెడ్ సూయన్ బ్లంట్ ఆలోచనతో రూపుదిద్దుకొని ఏడవ నిజాం రాజు కాలంలో రూపుదిద్దుకున్న ఓయూ వందేళ్లలో ఎందరో గొప్ప రాజకీయ నాయకులను, డాక్టర్లను, శాస్త్రవేత్తలను, పారిశ్రామికవేత్తలను తయారు చేసిందన్నారు.
