Asianet News TeluguAsianet News Telugu

అభ్యర్థులకు బీ ఫామ్స్ ఇచ్చిన జనసేనాని.. బరిలో నిలిచిన వారు వీరే..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటాయించిన అభ్యర్థులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ ఫామ్స్ అందించారు. ఈ తరుణంలో ఎన్నికల రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం అన్నారంటే..?  

Pawan Kalyan handed over B forms to Janasena party Candidates KRJ
Author
First Published Nov 8, 2023, 10:29 PM IST

తెలంగాణ ఎన్నికల సమరంలో జనసేన పార్టీ తొలిసారి ప్రత్యక్షంగా బరిలోకి దిగుతోంది. ఈ నెల చివర్లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీతో కలిసి జనసేన పోటీకి సిద్దమైంది. ఇరు పార్టీల పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించింది బీజేపీ. ఈ నేపథ్యంలో నేడు జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన  ఎనిమిది మంది జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫామ్ లు అందించారు. జనసేన పార్టీ ఆవిర్భవించి.. దశాబ్దకాలం గడుస్తున్న ఇప్పటి వరకూ ప్రత్యేక్షంగా ఎన్నికల బరిలో నిలువలేదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు నిలిచే తప్ప బరిలో దిగాలేదు. తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగి జనసేన తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ బాధల్నీ, ఆకాంక్షల్ని అర్థం చేసుకున్నవాడిగా రాష్ట్ర అభివృద్ధి సాధనకు తాను కట్టుబడి ఉందని తెలిపారు. తాను ఎప్పుడు తెలంగాణ పోరాటాలకు అండగా ఉండేవాడిననీ, తెలంగాణ స్ఫూర్తిగా తెలంగాణ పోరాడుతూ.. ఆ పోరాట స్ఫూర్తితోనే తాను జనసేన పార్టీని స్థాపించి, ముందుకు నడుస్తున్నానని  అన్నారు. హోమ్ రూల్ పాటించాలనే ఆలోచనతోనే దశాబ్ద కాలంగా తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఆవిర్భవించి దశాబ్ద కాలం అనంతరం నేడు మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి ఎనిమిది మంది అభ్యర్థులతో ఎన్నికల బరిలో నిలిచామని తెలిపారు.

నాలుగు కోట్ల మంది ప్రజలు వచ్చి సకల జనులు సమ్మె చేస్తే సాధించుకున్న తెలంగాణలో యువత ఆకాంక్షలు నేరవేరాలని కోరుకున్నారు. ఇరురాష్ట్రాల ప్రగతి కోసం తాను పాటు పడుతాననీ,  ఆంధ్ర అభివృద్ధి సాధిస్తేనే ఆంధ్రవలసలు ఆగుతాయనీ, లేకపోతే.. తెలంగాణ సాధించుకున్న విశిష్టత మూల కారణం కూడా నిష్ప్రయోజనం అవుతుందని అన్నారు.  

అందుకే నేడు మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో దృష్టి సారించమనీ, తెలంగాణలో జనసేన తెలంగాణ ప్రజలందరికీ అండగా ఉంటుందని తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు తాను మద్దతుగా నిలుస్తాననీ, తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. తన మాటను గౌరవించి.. బరిలో నుంచి తప్పకున్న వారికి ధన్యావాదాలు తెలుపుతూ.. వారి  భవిష్యత్తు నిర్మించే దశగా తాను అడుగులేస్తానని ప్రకటించారు. 

బరిలో నిలిచిన జనసైనికులు వీరే.. 

  • కూకట్‌పల్లి: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
  • తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
  • కోదాడ: మేకల సతీష్ రెడ్డి
  • నాగర్ కర్నూల్: వంగల లక్ష్మణ్ గౌడ్
  • ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
  • కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
  • వైరా (ఎస్టీ): డా. తేజావత్ సంపత్ నాయక్
  • అశ్వారావుపేట(ఎస్టీ): ముయబోయిన ఉమాదేవి
Follow Us:
Download App:
  • android
  • ios