Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ కు పటాన్ చెరు నేత నీలం మధు రాజీనామా.. మనస్తాపంతోనే నిర్ణయం...

పఠాన్ చెరు బీఆర్ఎస్ నేత నీతం మధు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతోనే ఈ నిర్షయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. 

Patan Cheru leader Neelam Madhu resigned from BRS - bsb
Author
First Published Oct 16, 2023, 12:48 PM IST | Last Updated Oct 16, 2023, 12:48 PM IST

సంగారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈసారి ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ రాకపోవడంతో మధు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించినట్లుగా తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి మధు స్వగ్రామం. సోమవారం ఉదయం అక్కడే మధు తన రాజీనామా ప్రకటనను చేశారు. తాను కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నట్లుగా ప్రకటించారు. త్వరలో, తన స్వగ్రామమైన కొత్తపల్లి నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లుగా తెలిపారు. చివరి క్షణం వరకు నీలం మధు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు భంగపాటు ఎదురయింది.

అజ్ఞాతంలో హత్యాయత్నం నిందితుడు.. 40 యేళ్లుగా టోలీచౌకీలో మకాం..

ఆదివారం నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఫాం వచ్చింది. దీంతో నీలం మధు ముదిరాజ్ తీవ్ర మనస్థాపానికి గురై నిర్ణయం తీసుకున్నారు. 2001లో బీఆర్ఎస్ లో చేరారు నీలం మధు. 2014లో జరిగిన జడ్పిటీసీ, ఎంపిటీసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. ఆ తరువాత, 2019లో చిట్కూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచ్ అయ్యారు.

రాజీనామా ప్రకటన చేసిన తర్వాత మధు మీడియాతో మాట్లాడారు. పటాన్చెరువులో ఆత్మగౌరవం కావాలో, అహంకారం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ‘ఇక్కడ సెట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మీ బిడ్డనై వస్తున్న ఈ  బీసీ బిడ్డను ఆశీర్వదించండి. దోచుకుని, దాచుకోవడం మహిపాల్ రెడ్డి తత్వం. 

పటాన్చెరువు నియోజకవర్గం ఏ ఒక్క కులానికో చెందింది కాదు. ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. మహిపాల్ రెడ్డి అక్రమాల చిట్టా మొత్తం నా దగ్గరుంది. నన్ను, నా కార్యకర్తలను తొక్కేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర మొత్తం పటాన్చెరువు వైపే చూస్తోంది. ఇక నిర్ణయం ప్రజలదే’ అంటూ మధు చెప్పుకొచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios