క్రాస్ మసాజ్ చేయిస్తూ అడ్డంగా బుక్కయిన సివిల్స్ ర్యాంకర్

Parlour raided for cross massage in Hyderabad
Highlights

2016 లో సివిల్స్ కి ఎంపికై... ఆ తర్వాత మసాజ్ సెంటర్ ప్రారంభించి...

అతడు చాలా ప్రతిభావంతుడు. ఎంతలా అంటే దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్ ను మొదటి ప్రయత్నంలోనే సాధించాడు. అంతటి ఉన్నత చదువులు చదివి,తన లక్ష్యానికి చేరువై కూడా చెడు మార్గంలో నడిచి కటకటాల పాలయ్యాడు. బిజినెస్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సివిల్ ర్యాంకర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  విశాఖ పట్నంకు చెందిన సంతోష్ కుమార్ పిజి వరకు చదివాడు. ఇతడు దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్ సర్విసెస్ సాధించాలన్న లక్ష్యంతో  ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ తన భార్యతో కలిసి ఉంటూ, సివిల్స్ కి ప్రిపేరవుతూనే ఖర్యులకు డబ్బుల కోసం సెలూన్ నిర్వహించేవాడు.

అయితే ఈ క్రమంలో భార్య భర్తలు విబేధాలు తలెత్తాయి. దీంతో సంతోష్ భార్యతో ఘర్షణ పడి దాడి చేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.

ఆ తర్వాత సంతోష్ బెయిల్ పై బయటకు వచ్చి సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించాడు. ఇలా మొదటి ప్రయత్నంలోనే కష్టపడి చదివి 2016 లో జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు పూర్తి చేసి మంచి ర్యాంకు సాధించాడు. అయితే ఇతడిపై ఉన్న క్రిమినల్ కేసు కారణంగా ఉద్యోగం రాలేదు.

ఇలా ఉద్యోగానికి దూరమైన ఇతడు డబ్బులు సంపాదించడానికి వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు. తన సెలూన్ ని మసాజ్ సెంటర్ గా మార్చి క్రాస్  మసాజ్ (అమ్మాయిలకు అబ్బాయిలతో, అబ్బాయిలకు అమ్మాయిలతో) చేయించేవాడు. ఇలా ఇతడు నిర్వహించే మసాజ్ సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మసాజ్ సెంటర్ పై దాడి చేసిన టాస్క్ పోర్స్ పోలీసులు నిర్వహకుడు సంతోష్ తో పాటు ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు.
 

loader