కత్తి మహేష్ పై పోరు: పరిపూర్ణానందకూ తప్పని నగర బహిష్కరణ

Paripurnananda banned from Hyderabad
Highlights

శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదంలో కత్తి మహేష్ కు నగర బహిష్కరణ విధించిన హైదరాబాదు పోలీసులు తాజాగా పరిపూర్ణానందపై కూడా నగర బహిష్కరణ విధించారు. ఆయనను తెల్లవారు జామున గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.

హైదరాబాద్: పరిపూర్ణానంద స్వామిని హైదరాబాదు నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

 ఆ తర్వాత ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు. శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావలు దెబ్బతిన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పరిపూర్ణానందం పాదయాత్ర తలపెట్టారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు.

అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించవద్దని, తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 

నాలుగు వాహనాల్లో బయలు దేరిన తెలంగాణ పోలీసులు స్వామి పరిపూర్ణాంద తరలింపులో రహస్యాన్ని పాటించారు. రెండు వాహనాలను విజయవాడ వైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు పంపించారు. 

ఈ రెండు మార్గాల్లో ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే స్వామి పరిపూర్ణాందను కాకినాడ తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

loader