Asianet News TeluguAsianet News Telugu

మరోసారి ఢిల్లీ పిలుపు: బిజెపిలో పరిపూర్ణానందకు కీలక బాధ్యతలు

ప్రధాని నరేంద్ర మోడీ కూడా పరిపూర్ణానంద కలుసుకుంటారని తెలుస్తోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రచార సారథిగా ఆయనను నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Paripoornananda may play key role in BJP
Author
New Delhi, First Published Oct 19, 2018, 8:01 AM IST

న్యూఢిల్లీ: శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు బిజెపిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆయనకు మరోసారి పిలుపు అందడంపై ఈ ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమవుతారని సమాచారం. 

ప్రధాని నరేంద్ర మోడీ కూడా పరిపూర్ణానంద కలుసుకుంటారని తెలుస్తోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రచార సారథిగా ఆయనను నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
 
పది రోజుల క్రితం అమిత్ షాతో పరిపూర్ణానంద న్యూఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్ధిగా పరిపూర్ణానందను ప్రకటించే అవకాశం ఉన్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అమిత్ షా ఆదేశాల మేరకు తన భవిష్యత్ కార్యక్రమాలు ఉంటాయని భేటీ తర్వాత పరిపూర్ణానంద తెలిపారు. 

శరన్నవరాత్రుల తర్వాత మళ్లీ కలుద్దామని అమిత్ షా చెప్పడంతో పరిపూర్ణానంద మళ్లీ ఢిల్లీకి వస్తున్నారు. తన ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా తెలుగువారికి ఆయన దగ్గరయ్యారు. 

సంబంధిత వార్తలు

అమిత్ షాతో పరిపూర్ణానంద స్వామి భేటీ... అందుకోసమేనా?

పొలిటికల్ ఎంట్రీపై స్వామి పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీలోకి పరిపూర్ణానంద స్వామి

Follow Us:
Download App:
  • android
  • ios