హుజూర్‌నగర్ ఉపఎన్నక సందర్భంగా తన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంపై సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ స్పందించారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నక సందర్భంగా తన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంపై సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ స్పందించారు. న్నికల కమీషన్ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసిన పత్రం లో నామినేషన్ దాఖలు చేశామని ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్తగా చేరిన కాలమ్ వెబ్ సైట్ లో అప్డేట్ కాలేదన్నారు. కేవలం రిటర్నింగ్ అధికారి వద్ద నేరుగా తీసుకున్న పత్రాల లో మాత్రమే ఆ కాలమ్ ఉందని శేఖర్ పేర్కొన్నారు.
అధికారిక వెబ్ సైట్ లో పెట్టకుండా మా నామినేషన్ తిరస్కరించడం సరికాదని ఆయన మండిపడ్దారు. న్యాయనిపుణుల తో సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని శేఖర్ స్పష్టం చేశారు,.
"
