హైద్రాబాద్ రామాంతపూర్‌లో దారుణం: టీచర్ కొట్టడంతో మృతి చెందిన యూకేజీ స్టూడెంట్
హైద్రాబాద్ నగరంలోని రామాంతపూర్ లో గల ఓ ప్రైవేట్ స్కూల్ లో యూకేజీ విద్యార్థిని టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ ముందు పేరేంట్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్‌లో టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. రామాంతపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న యూకేజీ విద్యార్థి హేమంత్ కుమార్ తలపై టీచర్ కొట్టారు. దీంతో హేమంత్ కుమార్ తలకు గాయమైంది. దీంతో హేమంత్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు పేరేంట్స్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హేమంత్ కుమార్ మృతి చెందినట్టుగా పేరేంట్స్ చెప్పారు.
రామాంతాపూర్‌లోని వివేక్‌నగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో యూకేజీ విద్యార్థి హేమంత్ కుమార్ ను టీచర్ తలపై పలకతో కొట్టారు. హేమంత్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే హేమంత్ కుమార్ తలపై టీచర్ కొట్టడం వల్లే అతను చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హేమంత్ కుమార్ చనిపోయాడు. హేమంత్ కుమార్ మృతదేహంతో ప్రైవేట్ స్కూల్ ఎదుట పేరేంట్స్ ఆందోళనకు దిగారు.
గత నెల 30వ తేదీన హేమంత్ కుమార్ స్కూల్ కు వెళ్లాడు. అయితే హోం వర్క్ చేయలేదని టీచర్ హేమంత్ కుమార్ ను కొట్టినట్టుగా పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. అయితే హేమంత్ కుమార్ మృతికి కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ విషయమై స్కూల్ యాజమాన్యం స్పందించడం లేదని మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. హోంవర్క్ చేయకపోతే చనిపోయేలా కొడతారా అని మృతుడి బంధువులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హేమంత్ కుమార్ పేరేంట్స్ డిమాండ్ చేస్తున్నారు.