ఎర్రగడ్డలో కాకుండా సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ స్థలంలో కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది.
తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి స్థలానికి తరలిస్తామని సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదట్లో ప్రకటించిన విషయం గుర్తుందా...?
భయంకరమైన వాస్తుదోషం ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కూడా...
అయితే అప్పట్లో సీఎం నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి సిబ్బంది కూడా వ్యతిరేకిస్తూ ఉద్యమించారు.
దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన సీఎం ఇప్పుడు మళ్లీ సచివాలయం తరలింపుపై యోచిస్తున్నారు.
అయితే గతంలో నిర్ణయించినట్లు ఎర్రగడ్డలో కాకుండా సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ స్థలంలో కొత్త సచివాలయం నిర్మించాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది.
ఇందుకు సంబంధించి సీఎం ఢిల్లీలో సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
అందేకాదు సెక్రటేరియట్ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్ ను తమకు అప్పగించాలని ప్రధాన మంత్రిని కూడా కేసీఆర్ కోరినట్లు తెలిసింది.
నీతి అయోగ్‌లో పాల్గొనేందుకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం అక్కడ ప్రధానితో భేటీ అయినప్పడు ఈ విషయాన్ని లేవనెత్తారట.
అయితే రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తారా లేదా అనేది డౌటే.
