Asianet News TeluguAsianet News Telugu

చంచల్ గూడా జైలుకు పల్లవి ప్రశాంత్

 బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ ను విధించారు.
 

 Pallavi Prashanth to Chanchal Guda Jail  - bsb
Author
First Published Dec 21, 2023, 7:13 AM IST

హైదరాబాద్ : బిగ్బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంతను చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడిని  తన స్వగ్రామం నుంచి  అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించారు. రహస్య ప్రదేశంలో 6 గంటల పాటు విచారించిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు నిన్న రాత్రి జడ్జి ముందు హాజరు పరిచారు. 

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులు జడ్జి 14 రోజుల రిమాండ్కు అనుమతినిచ్చారు. పల్లవి ప్రశాంత్ ని, అతని సోదరుడిని ఈ మేరకు పోలీసులు చంచల్గూడా జైలుకు తరలించారు.  ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన బిగ్బాస్ అనే రియాల్టీ షో  ఫైనల్  ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చెలరేగిన గొడవల్లో  ఆరు బస్సులను  ధ్వంసం చేశారు.  పల్లవి ప్రశాంత్,  అమర్ దీప్   అభిమానుల  మధ్య చెలరేగిన  వివాదం  ఉద్రిక్తతులకు దారితీసింది. 

 పోలీసులు వారిస్తున్న వినకుండా పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో ఈ ఘటనలు జరిగాయని పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించారు.  ఈ క్రమంలోనే పల్లవీ ప్రశాంత్ పరారీలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాను ఎక్కడికి వెళ్లలేదని తన ఇంట్లోనే ఉన్నానని.. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన ఫోన్ ఇంకా స్విచ్ ఆన్ చేయలేదని  ప్రశాంత్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో అతని స్వగ్రామానికి వెళ్లిన పోలీసులు బుధవారం రాత్రి  అరెస్టు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ ను విధించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios