అతి త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న వేళ ఆ అంశంపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో గతంలో పనిచేసిన ఓ ముగ్గురు సీనియర్ నాయకులకు మరోసారి మంత్రులుగా అవకాశం రాదంటూ రేవంత్ జోస్యం చెప్పారు. వివిధ కారణాలు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో వారిని కేసీఆర్ పక్కనబెడుతున్నారని రేవంత్ వెల్లడించారు.