తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో  క‌లిసి గ‌చ్చిబౌలిలోని ఆయ‌న నివాసంలో హోళీ సంబ‌రాలు చేసుకున్నారు.  కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. హోలీ  సంద‌ర్బంగా  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పండగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చే హోలీ పండగ విశిష్టమైనదని, అందరి జీవితాల్లో వెలుగులు విరబుయాలని ఆకాంక్షించారు.