Asianet News TeluguAsianet News Telugu

ఈటల తాతయ్య, జమున అమ్మమ్మ అంటూనే ... పాడి శ్రీనిక గట్టిగానే ఇచ్చిపడేసిందిగా..

ఈటల రాజేందర్, పాడి కౌశిక్ రెడ్డి మధ్య రాజకీయ వైరం కాస్త కుటుంబాల మధ్య శత్రుత్వంగా మారుతోంది. తాజాగా ఈటల కోడలు క్షమిత, పాడి కూతురు శ్రీనిజ మధ్య మాటల యుద్దం సాగుతోంది...

Padi Kaushik Reddy Daughter Srinika strong counter to Eatala Rajender family AKP
Author
First Published May 21, 2024, 4:12 PM IST

హుజురాబాద్ : మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ కు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రాజకీయ వైరం వారి కుటుంబాలకు పాకింది. ఇటీవల లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల కోడలు క్షమిత చేసిన కామెంట్స్ ఈ కుటుంబ వైరాన్ని బయటపెట్టాయి. తనపై, తండ్రి కౌశిక్ రెడ్డిపై క్షమిత చేసిన కామెంట్స్ కు అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు పాడి శ్రీనిక రెడ్డి.  ఆంటీ... ఆంటీ అంటూ వరసలు కలుపుతూనే గట్టిగా ఇచ్చిపడేసింది. 

''నేను స్కూలుకి వెళితే ఏంటీ... వెళ్లకపోతే ఏంటీ. మీరైమైనా నా ఫీజు కడుతున్నారా... ఎగ్జామ్ రాస్తున్నారా.  మా స్కూల్ ప్రిన్సిపాల్ కు, కన్న తల్లిదండ్రులకు లేని ప్రాబ్లం మీకెందుకు?'' అంటూ ఈటల క్షమితకు కౌంటర్ ఇచ్చారు శ్రీనిక.

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించినందుకు హుజురాబాద్ ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారన్న క్షమిత వ్యాఖ్యలపై శ్రీనిక స్పందించారు. అసలు హుజరాబాద్ అడ్రస్ తెలుసా ఆంటీ? ఎట్లుంటదో... ఎన్ని ఊర్లు వుంటాయో తెలుసా? కనీసం హుజురాబాద్ బార్డర్ అయినా టచ్ చేసారా? అని క్షమితను శ్రీనిక ప్రశ్నించారు. 

మామయ్య ఈటలకు హుజురాబాద్ గురించి బాగా తెలుసని క్షమిత ఆంటీ అంటున్నారు... అవును ఇది నిజమని శ్రీనిజ అన్నారు. ఈటల తాతయ్య గురించి ప్రజలకు అంతా తెలిసిపోయింది కాబట్టే మా డాడీని గెలిపించారంటూ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ నా ఊరు... మా తాతముత్తాలది ఇక్కడే... ఇక్కడి ప్రజలే మా ఫ్యామిలీ... వాళ్లే మా బలం అన్నారు. కానీ మీకలా కాదు...  హుజురాబాద్ లో ఓడితే గజ్వేల్ వెళతారు... అక్కడా ఓడితే మల్కాజ్ గిరి వెళతారంటూ శ్రీనిజ కౌంటర్ ఇచ్చారు.

''ఆంటీ... ఏమిటీ జంపింగ్ ప్రాసెస్... మేమయితే ఎప్పుడు ఇలా చేయలేదు. కేవలం ఓ ఐదేళ్లు పవర్ లేకుండా వుండలేకపోతున్నారా? అయినా ప్రజల నుండి... చివరకు ఆ దేవుడి నుండి అన్యాయంగా తీసుకున్ని భూములు కాపాడుకునేందుకు పవర్ కావాలి కదా... అందుకేనా ఈ తాపత్రయం'' అంటూ ఈటల కుటుంబంపై శ్రీనిజ సంచలన ఆరోపణలు చేసారు.

''ఈ సంపుకుంటరా... సాదుకుంటారా ట్రెండ్ స్టార్ట్ చేసిందే ఈటల తాతయ్య. గతంలో పాయిజన్ బాటిల్ లో జూస్ పోసుకుని నాటకాలాడింది ఈటల తాతయ్య.    తన మెడలోని తాళిబొట్టు వుంచుతారా... తెంచుతారా అంటూ ఓట్ల కోసం సెంటిమెంట్ గా మాట్లాడింది జమున అమ్మమ్మ. మీరు కదా ఇలాంటి రాజకీయాలకు బాటలు వేసింది'' అంటూ కౌంటర్ ఇచ్చారు. 

''అవును... మా డాడీ ఎంత మంచోడో, ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ది చేస్తారో చెప్పడానికే నేను క్యాంపెయిన్ చేసాను. ఎప్పటికైనా కేసీఆర్ తాతయ్య మళ్ళీ సీఎం అవుతారు... హుజురాబాద్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. వెయ్యి కోట్లతో హుజురాబాద్ ను అభివృద్ది చేస్తాను'' అని శ్రీనిజ స్పష్టం చేసారు. ఇలా ఈటల క్షమితకు కౌంటర్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసారు పాడి శ్రీనిజ రెడ్డి. 

 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios