ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడానికి ప్రభుత్వం సబ్సిడీ  ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతియేటా దీనికి సంబంధించి కోట్ల రూపాయిలను కూడా కేటాయిస్తున్నారు.

 

అయితే ఈ సబ్సిడీపై కరుడకట్టిన హిందుత్వవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

 

హజ్ యాత్రకు ముస్లింలకు సబ్సిడీ ఇస్తే.. కాశీ, తిరుమల తదితర పవిత్ర ప్రాంతాలకు వెళ్లేందుకు హిందువులకు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది.

 

హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సబ్సిడీగా ఇస్తున్న డబ్బును ముస్లిం బాలికల విద్యకు ఉపయోగించాలని కోరారు.