పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ పై ఓయు స్టూడెంట్స్ ఫైర్ (వీడియో)

OU students protest against the notification of police jobs
Highlights

గరం గరం

తెలంగాణ సర్కారు వెలువరించిన పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పై ఉస్మానియా విద్యార్థులు ఫైర్ అయ్యారు. తక్షణమే ఈ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వయో పరిమితి పెంచకపోతే చాలామంది నిరుద్యోగులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో కింద ఉంది చూడండి.

"

 

గన్ పార్కు వద్ద ధర్నా

పోలీస్ కానిస్టేబుల్/ఎస్సై ఉద్యోగాల్లో 6ఏళ్ళ వయోపరిమితి పెంచాలని హైద్రాబాద్ గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ధర్నాకు దిగిన నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ తో పాటు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి రాంగోపాలపేట్ పోలీస్టేషన్ కు తరలించారు. ఐదుగురు నిరుద్యోగ అభ్యర్థులను చర్చలు జరపటానికి రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి వద్దకు తీసుకువెళ్ళేందుకు రాంగోపాల్ పేట్ పోలీసులు అంగీకరించారని స్టూడెంట్స్ తెలిపారు.

loader