Asianet News TeluguAsianet News Telugu

లైంగిక వేధింపులు .. ఢిల్లీలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు

origin dairy partner shejal suicide attempt in delhi over mla durgam chinnaiah harassment ksp
Author
First Published Jun 2, 2023, 4:25 PM IST

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె విషం తాగారు. దీంతో వెంటనే స్పందించిన తోటివారు శేజల్‌ను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. దుర్గం చిన్నయ్య తనను మానసికంగా , లైంగికంగా వేధిస్తున్నారని బోడపాటి శేజల్ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యేను తక్షణం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయాలని శేజల్ డిమాండ్ చేస్తున్నారు. 

ALso Read: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు.. ఢిల్లీలో బాధితుల ఆందోళన

ఎమ్మెల్యే చిన్నయ్య వల్ల తమ కంపెనీలో వున్న వాళ్లంతా రోడ్డున పడ్డారని ఆరోపించారు. తాము బెయిల్‌పై బయటకు వచ్చినా బెదిరిస్తున్నారని శేజల్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని శేజల్ పేర్కొన్నారు. తొలుత ఆయనను తమ కంపెనీ బ్రాంచ్ ఓపెనింగ్‌కి పిలిచామన్నారు. అయితే తమ కంపెనీలో షేర్ అడిగారని.. అలా అయితేనే ఇక్కడ బ్రాంచ్ పెట్టేందుకు ఛాన్స్ ఇస్తానని అన్నారని శేజల్ ఆరోపించారు. 

దీనికి తాము ఒప్పుకుని.. ఆయన బావమరిదికి షేర్ ఇచ్చామని ఆమె వెల్లడించారు. ఒక నెల తమతో బాగానే వున్నారని.. కానీ అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయని శేజల్ చెప్పారు. ఆయన కోరిక తీర్చాలంటూ మమ్మల్ని వేధించడం మొదలుపెట్టారని శేజల్ ఆరోపించారు. తనను పట్టించుకోకుంటే.. మీపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని శేజల్ తెలిపారు. ఓ రోజున దళిత బంధు గురించి మాట్లాడుకుందామని పిలిపించి.. ఆ పథకంలో తనకు వాటా కావాలని, తాను చెప్పిన వారి పేర్లే పెట్టాలని డిమాండ్ చేశారని ఆమె చెప్పారు. దీనికి తాము నో చెప్పడంతో ఎమ్మెల్యే తమపై తప్పుడు కేసులు పెట్టించి మమ్మల్ని రిమాండ్‌కు పంపించారని శేజల్ తెలిపారు. బయటకు వచ్చాక కూడా తమకు వేధింపులు ఆగడం లేదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios