Asianet News TeluguAsianet News Telugu

కెటిఆర్ ఒక దేశ దిమ్మరి

  • కెటిఆర్ ఒక దేశదిమ్మరి
  • విపక్షాలు టూరిస్టులంటవా?
  • నువ్వే ఒక దేశ దిమ్మరి వి
  • నీకు ఎక్కడ దిక్కులేక సిరిసిల్లకు పోయినవు
  • ఇసుక మాఫియా పై న్యాయ విచారణ జరపాలి
  • సంతోష్ రావు లారీలపై విచారణ జరపాలి
  •  
opposition leaders say ktr is a vagabond

మంత్రి కెటిఆర్ పై మరోసారి మండిపడ్డారు టిడిపి నేత రేవంత్ రెడ్డి. సిరిసిల్ల వెళ్లి వచ్చిన రాజకీయ నాయకులంతా టూరిస్టులే అని కామెంట్ చేసిన కెటిఆర్ నిజమైన దేశ దిమ్మరి అని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం.లో మానవ హక్కులు హరిస్తున్నారని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులుతోటే రాష్ట్రాన్ని పాలించాలన్నట్లు కెసిఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడా దిక్కు లేని కెటిఆర్ ను గెలిపించి మంత్రిని చేస్తే బహుమానంగా ప్రజలను గొడ్డులను బాదినట్లు కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఫ్యామిలీ దోపిడీకి తెలంగాణలోని 4 కోట్ల మంది  బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైష్ణవి గ్రానైట్స్, సాయిరాం మినరల్స్, గోల్డ్ మెయిన్ మినరల్స్ ఎవరివో తెలియదా అని నిలదీశారు. ఇవన్నీ కెసిఆ చుట్టం, టిన్యూస్ సంతోష్ రావు సంస్థలు కావా అని ప్రశ్నించారు. ఇసుక దోపిడీని కెసిఆర్ కుటుంబమే చేస్తుందన్నది ముమ్మాటికీ వాస్తవమేనన్నారు రేవంత్. ఇది నిజం కాకపోతే ఇసుక టెండర్లు, ఇసుక సరఫరా పై న్యాయ విచారణ చేపట్టాలని సవాల్ చేశారు. ఒకటే నంబర్ ప్లేట్ తో 8 లారీలు నడుస్తున్నాయని ఆరోపించారు. కెటిఆర్ శాఖలోనూ అవినీతి జరిగింది, అన్ని ఆధారాలున్నాయి. అలాంటప్పుడు రాజయ్యను బర్తరఫ్ చేసిన తీరులోనే కెటిఆర్ ను ఎందుకు బర్తరప్ చేయరని ప్రశ్నించారు. నీ కొడుకు కాబట్టే బర్తరఫ్ చేయడంలేదా అని ప్రశ్నించారు.

సోమాజీగూడలో నేరెళ్ల బాధితుల గోడు పేరుతో తెలంగాణ టిడిపి ఫొటో ఎగ్జిబిషన్ చేపట్టింది. దీనికి అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎల్ రమణ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజానీకానికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. కెటిఆర్ కు నైతిక విలువలు ఉంటే  వెంటనే తన మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎంతో పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేసిందన్నారు. నేరేళ్ల సంఘటన యావత్ తెలంగాణా ప్రజానీకం తలదించుకునే విధంగా ఉందన్నారు. బాధితులను చూసి తల్లడిల్లిన మీరా కుమార్ కంట తడిపెడితే కేసీఆర్ హేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ నేరేళ్లలో తారా  స్థాయిలో చిత్రహింసలు పెట్టారన్నారు. 21 రోజులు గడుస్తున్నా బాధితులకు గాయాలు మానలేదని, మూత్రం లో రక్తం విడుదలవుతోందంటే ఏ విధంగా హింసించారో అర్థం అవుతోందన్నారు. బట్టలు ఉడదీసి సున్నిత ప్రాంతాల్లో కరెంట్ షాక్ పెట్టారని చెప్పారు. తన కెరీర్ లో ఎన్నో కేసులను చూసినా ఇంతటి టార్చర్ ను ఎప్పుడు  చూడలేదన్నారు.

జెఎసి ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ  లారీని తగుల బెట్టారన్న నెపంతో పది కుటుంబాలను టార్గెట్ చేశారన్నారు. ఓవర్ లోడ్, స్పీడ్ గురించి కలెక్టర్ కు, పోలీసులకు గ్రామస్తులు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా ఫలితంలేదన్నారు. ఇది ముమ్మాటికీ దళితులపై దాడిగానే పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో బిజెపి నేత చింతా సాంభమూర్తి, సిపిఐ నేత బాలస్వామి, టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios