గ్యారెంటీల అమలుకు 100 రోజులే గడువు.. తరువాత పోరాటాలే - గంగుల కమలాకర్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాల్సిందేనని బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar)అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు 100 రోజుల పాటు ఎదురు చూస్తామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగు సార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. నా చివరి క్షణం వరకూ ప్రజల కోసమే పని చేస్తానని హామీ ఇచ్చారు.
ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. బౌలర్లకు మరో అస్త్రం.. బ్యాటర్లకు చుక్కలే..
15 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి, వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలని తెలిపారు. జవాబుదారీగా పని చేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా పోరాడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో డిసెంబర్ 9వ తేదీనే రైతులకు రైతు బంధు, రుణమాఫీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు.
IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలికాడంటే ? జట్టు వారీగా వివరాలు..
డిసెంబర్ 19వ తేదీ వచ్చినా ఆ హామీల ఊసే లేదని చెప్పారు. వాటి కోసం రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని గంగుల కమలాకర్ అన్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యాయని, ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని తెలిపారు. రైతులకు ఇస్తామన్న బోనస్ ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీ ల అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇస్తామని, తరువాత నిరసన తప్పదని అన్నారు.
ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. బౌలర్లకు మరో అస్త్రం.. బ్యాటర్లకు చుక్కలే..
బీఆర్ఎస్ కు పోరాటాలు కొత్తవేమీ కాదని అన్నారు. తాము రోడ్డు ఎక్కే పరిస్థితి తెచ్చుకోకూడదని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఉందని అన్నారు. అవి తప్పకుండా అమలు చేయాలని సూచించారు. అమలు చేసేంత వరకు తాము ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై యాక్షన్ ప్లాన్ కోసం తమ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన పనులను కూడా పూర్తి చేయాలని సూచించారు.