• ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు
  • మంత్రి కెటి రామారావుకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ప్రత్యేక ఆహ్వానం
  • మోబైల్ మరియు సంబంధింత రంగంలో కేంద్రం నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ స్ధాయి సమావేశం
  • ఈ సమావేశంలో “సస్టైనబుల్- వైఫై”  అనే అంశంపైన ప్రత్యేకంగా ప్రసంగించాలని కోరిన కేంద్రమంత్రి మనోజ్ సిన్హా
  • తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి ఇంటర్నెట్ ప్రాజెక్టు, డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ ఏనర్జీ సొల్యూషన్స్, ఈ- హెల్త్, ఈ- విద్యా వంటి అంశాల పైన మంత్రి ప్రసంగం
  • తెలంగాణ ప్రభుత్వ ఐటి శాఖ చేపట్టిన టి హబ్, తెలంగాణలోని స్మార్ట్ సిటీల మున్సిపల్ కార్పొరేషన్ల పై సదస్సులో భాగసామ్యం కోరిన కేంద్ర మంత్రి

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2017 సమావేశంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నాల్సిందిగా మంత్రి కెటి రామారావుకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా ప్రత్యేక ఆహ్వానం పంపించారు.  మెదటిసారి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ మోబైల్ కాంగ్రెస్ లో ప్రసంగించాలని(speakerగా) మంత్రిని ప్రత్యేకంగా కోరారు. సెప్టెంబరు 27 వ తేదీన ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించబోతున్నారు. భారతదేశం తొలిసారి కమ్యూనికేషన్స్ శాఖ మరియు సెల్యూలర్  ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలసి మొదటిసారి ఈ సమావేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియా విజన్ మేరకు దేశంలో డిజిటల్ రంగంలో వస్తున్న మార్పులు, ఆవిష్కరణలను ఈ సమావేశంలో ప్రపంచానికి ప్రదర్శించనున్నారు.

ఈ అంతర్జాతీయ సమావేశం ప్రధానంగా టెక్నాలజీ, వ్యాపారం, పాలసీ మరియు డిజిటల్ లైప్ అనే నాలుగు ప్రధానమైన అంశాల పైన చర్చించనుంది. ప్రభుత్వాధికారులు , విద్యావేత్తలు, వందలాది కంపెనీలు సీఈవోలు హాజరుకానున్న ఈ సమావేశంలో “సస్టైనబుల్- వైఫై”  అనే అంశంపైన ప్రత్యేకంగా ప్రసంగించాలని కేంద్రమంత్రి మనోజ్ సిన్హా కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి ఇంటర్నెట్ ప్రాజెక్టు, డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ ఏనర్జీ సొల్యూషన్స్, ఈ- హెల్త్, ఈ- విద్యా వంటి అంశాల పైన మంత్రి ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటి శాఖ చేపట్టిన టి హబ్, ఇతర కార్యక్రమాలతోపాటు , తెలంగాణలోని స్మార్ట్ సిటీల మున్సిపల్ కార్పొరేషన్ కమీషనరెట్లతో ప్రత్యేక  భాగసామ్యం కోరుకుంటున్నట్లు మంత్రి మనోజ్ సిన్హా లేఖలో పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం మొదటిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ప్రత్యేక వక్తగా ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సాంకేతికత ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు. ఈ సమావేశానికి అహ్వానించిన కేంద్ర మంత్రికి కెటి రామరావు దన్యవాదాలు తెలిపారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి