Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య.. ఆ మార్గంలో నిలిచిన రైలు..

హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట-రాయదుర్గం మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది.

Once again technical glitch in hyderabad metro rail
Author
First Published Jan 24, 2023, 3:37 PM IST

హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట-రాయదుర్గం మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ రైలు అరగంట పాటు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగాయి. దీంతో మెట్రో సర్వీసుల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. 

Also Read: హైదరాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం.. ఎర్రమంజిల్‌లో రైలు నిలిపివేత.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..

ఇక, సోమవారం కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మార్గంలో వెళ్తున్న ఓ రైలును ఎర్రమంజిల్ స్టేషన్‌లో కొద్దిసేపు నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్ల రాకపోకలకు ప్రభావం పడింది. రైలు సర్వీసులు ఆలస్యంగా కొనసాగాయి. ఇదే విషయమై ప్రయాణికులు సోషల్‌మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. సాంకేతిక సమస్యను సరిదిద్దిన తర్వాత వెంటనే కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios