డ్రైవర్ల సమ్మెతో ఓలా, ఊబర్ క్యాబ్ సంస్థలకు చెందిన సర్వీసులు ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు వెళ్లడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటరుకు ఇచ్చే ఛార్జీలు పెంచాలని, క్యాబ్ సంస్థలు తీసుకునే కమీషన్ తగ్గించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పట్టడంతో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజు ఈ రెండు క్యాబ్ సంస్థలు దాదాపు 3 వేల సర్వీసులు అందించేవి. ఇవి నిలిచిపోవడంతో దాదాపు ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు.
బీజేపీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం- మంత్రి జగదీష్ రెడ్డి
కిలో మీటర్ ఛార్జీలు పెంచాలని డిమాండ్...
కిలో మీటర్‌కు తమకు ఇప్పుడిచ్చే కమీషన్ సరిపోవడం లేదని, దానిని పెంచాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. గతంలో తమకు రోజుకు రెండు నుంచి మూడు వేలు వచ్చేవని, కానీ ఇప్పుడు డిజీల్ రేట్లు పెరిగాయని, దీంతో పాటు రెండు క్యాబ్ సంస్థలు ముప్పై శాతం కమీషన్ తీసుకోవడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. పెరిగిన డిజీల్ ధరలు, ఓలా కమిషన్‌లతో తమకు ఇప్పుడు రోజుకు వెయ్యి కూడా రావడం లేదని అంటున్నారు. రెండు క్యాబ్ సంస్థలు తీసుకునే కమిషన్‌ను తగ్గించాలని, తమకు కిలో మీటర్‌కు రూ.22 ఇవ్వాలని డిమండ్ చేస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తేనే తాము మళ్లీ విధుల్లో చేరుతామని స్పష్టం చేస్తున్నారు.
వడ్లు కొనమంటున్న బిజెపి మనకొద్దు...డిల్లీ గద్దెపై నుండి దించేద్దాం..: హరీష్ రావు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు..
ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తూ, పోతూ ఉంటారు. వారిని ఎయిర్ పోర్టుకు, ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ సిటీ లోపలకు తీసుకెళ్లడంలో క్యాబ్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. సొంత కార్లు, ఇతర వాహనాలు లేని ప్రయాణికులకు ఈ క్యాబ్‌లు విశేష సేవలు అందిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చి డైరెక్ట్ గా ఎయిర్ పోర్టు నుంచి ఈ క్యాబ్ ల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరే వారెందరో ఉన్నారు. క్షణాల్లో బుక్ అవ్వడం, రీజనబుల్ ఛార్జీలు ఉండటం, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుండటంతో ఈ క్యాబ్‌లు విశేష ఆదరణ పొందుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ క్యాబ్‌లు నిలిచిపోవడంతో ఎయిర్ పోర్టు నుంచి సిటీలోకి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను నివారించడానికి ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు కొత్త క్యాబ్ సర్వీసీలు, ఆర్టీసీకి చెందిన పుష్పక్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారు.
