Asianet News TeluguAsianet News Telugu

బీజేపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం- మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి రైతుల సమస్యలు పట్టవని, కేవలం తన స్వార్థ రాజకీయ  ప్రయోజనాలే చూసుకుంటుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బుదవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 

Political interests are important to the BJP - Minister Jagadish Reddy
Author
Hyderabad, First Published Dec 22, 2021, 7:12 PM IST

బీజేపీకి త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని, రైతుల ప్రయోజ‌నాల‌తో ఆ పార్టీకి సంబంధం లేద‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఆరోపించారు. బుధ‌వారం సాయంత్రం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. వ‌రి కొనుగోళ్ల విష‌యం ప‌క్కదారి ప‌ట్టించ‌డానికి తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయంటూ బీజేపీ నాయ‌కులు మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దొంగ‌ట ఆడుతోంద‌ని అన్నారు. రైతుల స‌మ‌స్య‌లు కేంద్రానికి ప‌ట్ట‌వ‌ని, కాబ‌ట్టి రైతులే ఎవ‌రికి వారు ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎవ‌రు రైతుల కోసం ప‌ని చేస్తున్నారో ? ఎవ‌రు రైతుల ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారో గ‌మ‌నించాల‌ని కోరారు. 

వడ్లు కొనమంటున్న బిజెపి మనకొద్దు...డిల్లీ గద్దెపై నుండి దించేద్దాం..: హరీష్ రావు

కాంగ్రెస్ కూడా బీజేపీకి ఓ తోడు దొంగ‌లా వ్య‌వ‌హ‌రిస్తోందని ఆరోపించారు. తెలంగాణ‌కు చెందిన ఎంపీల‌కు పార్ల‌మెంటులో మాట్లాడే అవ‌కాశం వ‌చ్చినప్పుడు, రైతు ఉత్ప‌త్తులు కొనుగోలు అధికారం ఉండే కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌కుండా టీఆర్ఎస్ ను విమ‌ర్శించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. పార్ల‌మెంట్‌లో బీజేపీకి వంత‌పాడుతూ ఆ పార్టీని నుంచి మంచి మార్కులు పొందాల‌ని కాంగ్రెస్ ఎంపీలు చూస్తున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్ల‌మెంటు స‌భ్యులెవ‌రూ తెలంగాణ రైతుల త‌ర‌ఫున మాట్లాడ‌లేదని అన్నారు. తెలంగాణ రైతాంగం కోసం చివ‌రి వ‌ర‌కు కూడా పోరాడే వ్య‌క్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఒక్క‌టే రైతుల ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతుంద‌ని అన్నారు. కాంగ్రెస్ స‌భ్యులు పార్లమెంట్ లో ఏం మాట్లాడారో దేశం మొత్తం చూసింద‌ని తెలిపారు. 
తాము బీజేపీని టీఆర్ఎస్ పార్టీ స‌భ్యులుగా అడ‌గ‌డం లేద‌ని ఒక బాధ్య‌త గ‌త తెలంగాణ ప్ర‌భుత్వంగా కేంద్రం ప్ర‌భుత్వాన్ని అడ‌గుతున్నామ‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్సీఐ అధికారి త‌మ అధికారుల‌కు ఒక సంత‌కం పెట్టి లేఖ ఇస్తే స‌మ‌స్య అక్క‌డితో తీరిపోయేద‌ని, తామెందుకు ఢిల్లీ వ‌ర‌కు వ‌చ్చేవారిమ‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తోంద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం వ‌డ్ల కొనుగోళు హామీకి సంబంధించిన హామీ లేఖ‌పై ఇస్తే స‌మ‌స్య తీరుపోతుంద‌ని క‌దా అని ప్ర‌శ్నించారు. తాము కేటాయించిన 27 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం తెలంగాణ ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌లేద‌ని కొంద‌రు బీజేపీ నాయ‌కులు మాట్లాడుతున్నార‌ని తెలిపారు. ధాన్యం మిల్లుల్లో వ‌చ్చి ఉంద‌ని, దానిని త‌ర‌లించాల్సిన బాధ్య‌త ఎఫ్‌సీఐ ఉంద‌ని తెలిపారు. రైల్వే వ్యాగ‌న్లు తీసుకొచ్చి, గోదాంలో ఉంచుకోవాల్సింది కేంద్ర‌మే అని చెప్పారు. 

కేసీఆర్ కు పాలన చేతగాకే ధర్నాలు, చావుడప్పులు... వరి వద్దన్న ఈ సీఎం ఇక మనకొద్దు: షర్మిల ఫైర్
కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ మాట‌లు స‌రిగా లేవ‌ని అన్నారు. తెలంగాణ రైతుల క‌ష్టాల గురించి మాట్లాడేవారు ఆయ‌న‌కు ప‌ని లేని వారిగా క‌నిపిస్తున్నార‌ని అన్నారు. కేంద్ర మంత్రి ఒక వ్యాపార‌వేత్త అని, ఆయ‌న‌కు రైతు క‌ష్టాలంటే ఏమిటో తెలియ‌ద‌ని తెలిపారు. పీయూష్ గోయ‌ల్ ఒక్క సంత‌కం చేస్తే ప‌ని అయిపోతుంద‌ని, అలాంట‌ప్పుడు తాము ఢిల్లీకి రాక‌ముందే దానిని పూర్తి చేస్తే స‌మ‌స్య తీరిపోయేదని అన్నారు. తాము ఢిల్లీకి వ‌స్తున్నామ‌ని కేంద్ర ప్రభుత్వ అధికారులంద‌రికీ తెలుస‌ని, మ‌రి అలాంట‌ప్పుడు ముందే చెబితే ఢిల్లీకి ఎందుకు వ‌చ్చేవారిమ‌ని అన్నారు. అస‌లు బీజేపీకు రైతు సంక్షేమం ప‌ట్ట‌దని అన్నారు. దేశ వ్య‌వ‌సాయ రంగాన్ని తీసుకెళ్లి ఎప్పుడు వ్యాపార‌వేత్త‌ల‌కు క‌ట్ట‌బెట్టాల‌నే తొంద‌ర‌లోనే ఉంటుంద‌ని ఆరోపించారు. వంద‌లాది మంది రైతులు చ‌నిపోతున్న ప‌ట్టించుకోని బీజేపీకి తెలంగాణ రైతుల గురించి ఆలోచించే తీర‌క ఎక్క‌డిదని ప్ర‌శ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios