Asianet News TeluguAsianet News Telugu

వనస్థలిపురంలో కరోనా ఉధృతి, 8 కంటైన్మెంట్ జోన్లు: వారం పాటు రాకపోకలు బంద్

హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. వనస్థలిపురంలో ఎనిమిది  కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చారు.
 

Officials Identified 8 Colonies as Containment Zones at  Vanasthalipuram in Hyderabad
Author
Hyderabad, First Published May 3, 2020, 6:06 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. వనస్థలిపురంలో ఎనిమిది  కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చారు.

వనస్థలిపురంలోని మూడు కుటుంబాల్లో 9 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిని ఆసుపత్రికి తరలించారు. హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్, సాహెబ్ నగర్ రోడ్డు, ఏబీ టైప్ కాలనీలు, ఎస్ కే డీ నగర్, ఫేజ్ 1 కాలనీ, సచివాలయనగర్ లను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతంలోని 169 మందిని క్వారంటైన్ కు తరలించారు.

కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో సోమవారం నుండి వారం రోజుల పాటు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా నిబంధనలను అమలు చేయనున్నారు. రైతు బజార్, పండ్లు, ఇతర మార్కెట్లను పూర్తిగా మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ముందుజాగ్రత్తగా కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. 

also read:స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ పాసుల జారీ: తెలంగాణ డీజీపీ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకొంటుంది. ఈ నెల 5వ తేదీన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యులపై చర్చించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios