ఒడిశా రైలు ప్రమాదం: తెలంగాణకు చెందిన ప్రయాణికులెవరూ లేరు..

Hyderabad: ఒడిశా రైలు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ప్రయాణికులు లేరని ప్ర‌భుత్వం తెలిపింది. భారీ ప్రాణ‌న‌ష్టాన్ని క‌లిగించిన కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద సహాయక చర్యలకు ఒడిశా ప్రభుత్వానికి తెలంగాణ స‌ర్కారు మ‌ద్ద‌తునిస్తున్న‌ద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. 
 

Odisha train accident: No passengers from Telangana RMA

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ప్రయాణికులు లేరని ప్ర‌భుత్వం తెలిపింది. భారీ ప్రాణ‌న‌ష్టాన్ని క‌లిగించిన కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద సహాయక చర్యలకు ఒడిశా ప్రభుత్వానికి తెలంగాణ స‌ర్కారు మ‌ద్ద‌తునిస్తున్న‌ద‌ని సంబంధిత అధికారులు తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే..  ఒడిశాలోని బాల‌సోర్ లో శుక్రవారం జరిగిన రైల్వే ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి పెరిగిందని భారతీయ రైల్వే శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అంత‌కుముందు ఈ ప్రమాదంలో 238 మంది చనిపోయారనీ, 900 మంది ప్రయాణికులు గాయపడ్డారని ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా తెలిపారు. అయితే, ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 300 మందికి పైగానే చ‌నిపోయార‌ని తాజా మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి.చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగానే ఉందని వైద్యులు తెలిపారు. 

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారిలో రాష్ట్రానికి చెందిన ప్రయాణికులెవరూ లేరని తెలంగాణ ప్రభుత్వం వెల్ల‌డించింది. సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వానికి తన మద్దతు తెలిపింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, ఎస్ ఎంవీటీ-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లకు చెందిన పదిహేడు బోగీలు పట్టాలు తప్పడంతో గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన రైల్వే ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి సిగ్నలింగ్ వైఫల్యమే కారణమని తొలుత చెప్పినప్పటికీ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి ప్రవేశించి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిందా లేక మొదట పట్టాలు తప్పి లూప్ లైన్ లోకి ప్రవేశించిన తర్వాత ఆగి ఉన్న రైలును ఢీకొట్టిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని రైల్వే అధికారులు తెలిపారు.

అంతకుముందు రైలు ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించిన ఆయన ప్రాణనష్టం, క్షతగాత్రులపై విచారం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న యాంటీ కొలిషన్ డివైజెస్ సామర్థ్యాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios