ఓబుళాపురం గనుల కేసును విశాఖకు బదిలీ చేయాలని సీబీఐ.. న్యాయస్థానాన్ని కోరింది.  ఓబుళాపురం గనులు అనంతపురం జిల్లాలో ఉన్నాయని.. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేసును విశాఖకు బదిలీ చేయాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన గాలి జనార్థన్ రెడ్డి కేసు విశాఖకు బదిలీ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ మాత్రం విశాఖకు బదిలీ చేయొద్దని కోరారు. దీనిపై న్యాయస్థానం తన తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.