హైద్రాబాద్‌లో బీజేపీ కార్యాలయం ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం, ఉద్రిక్తత: లాఠీచార్జీ చేసిన పోలీసులు


హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయంలోకి ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు వెళ్లేందుకు  ప్రయత్నించగా  బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకంది. 

NSUI Workers Protest in front BJP Office In Hyderabad

హైదరాబాద్: BJP  కార్యాలయాన్ని సోమవారంనాడు NSUI  కార్యకర్తులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎమ్మెల్యే Raghunandhan Rao  కు వ్యతిరేకంగా ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు  నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎన్ఎస్ యూఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఎన్ఎస్ యూ ఐ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు.

హైద్రాబాద్ అమ్నేషియా పబ్ నుండి మైనర్ బాలికను తీసుకెళ్లి సామూహిక అత్యాచారం ఘటనకు పాల్పడిన ఘటన విషయమై ఎమ్మెల్యే రఘునందన్ రావు రెండు రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.ఈ మీడియా సమావేశంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పోటోలను ఎమ్మెల్యే మీడియా సమావేశంలో విడుదల చేశాడు. దీనికి సంబంధఇంచిన ఫోటోలు, వీడియోలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు.

also read:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: మరో బాలికను వేధించిన గ్యాంగ్, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

అయితే మైనర్ బాలిక ఫోటోలను మీడియా సమావేశంలో విడుదల చేయడంపై ఎన్ఎస్‌యూఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫోటోను మీడియాకు విడుదల చేయడాన్ని తప్పు బట్టారు. బాధితురాలిని గుర్తించేలా మీడియాకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫోటోలు విడుదల చేశారని ఎన్‌ఎస్‌యూఐ నేతలు విమర్శించారు. 

రఘునందన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ఎస్‌యూఐ కార్యకర్తల ఆందోళనను చూసిన బీజేపీ కార్యకర్తలు కూడా ఎన్‌ెస్‌యూఐ కార్యకర్తలకు పోటీగా నినాదాలకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. బీజేపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఎన్‌ఎస్‌యూఐ క్యాడర్ ప్రయత్నించింది. బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా పరిస్తితి సద్దుమణగకపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో  గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios