సీడీపీఓ, ఎక్స్‌టెన్షన్ పరీక్షలు రద్దు: తెలంగాణ హైకోర్టులో పిటిషన్

టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన  మరో రెండు పరీక్షలను రద్దు  చేయాలని  తెలంగాణ హైకోర్టులో  ఎన్ఎస్‌మూఐ  ఇవాళ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 

NSUI Telangana President Venkat  Files Petition For seeking Cancel CDPO, Extension officer Exam lns

హైదరాబాద్:టీఎస్‌పీఎస్‌సీ  నిర్వహించిన  సీడీపీఓ,  ఎక్స్ టెన్షన్ ఆపీసర్స్ పరీక్షలను రద్దు  చేయాలని  గురువారంనాడు  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు పరీక్షలకు  సంబంధించిన పేపర్లు కూడా లీకయ్యాయనే అనుమానాన్ని   పిటిషనర్లు అనుమానం వ్యక్తం  చేశారు. ఈ ఏడాది జనవరి  3న  ఈ పరీక్షలు  నిర్వహించిన  విషయం తెలిసిందే.  ఎన్ఎస్‌యూఐ  రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా  56 మంది తెలంగాణ హైకోర్టులో పిటిషన్  దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై  ఈ నెల  10వ తేదీన విచారణ జరిగే అవకాశం ఉంది.  

టీఎస్‌పీఎస్‌సీ  నిర్వహించిన  పలు పరీక్షల  పేపర్లు లీకయ్యాయనే  కారణంగా  కొన్ని పరీక్షలను రద్దు చేయడంతో పాటు  మరికొన్ని పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి  12, 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన  పరీక్షలను  తొలుత టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.

also read:పేపర్ లీక్.. కేటీఆర్ కేబినెట్‌లో వుండకూడదు, అప్పుడే విచారణ ముందుకు : రేవంత్ రెడ్డి

టీఎస్‌పీఎస్‌సీకి చెందిన కంప్యూటర్లు  హ్యాక్ అయ్యాయనే అనుమానంతో   టౌన్ ప్లానింగ్  ఓవర్సీస్,  వెటర్నరీ అసిస్టెంట్  సర్జన్  నియామాకాలకు  సంబంధించిన పరీక్షలను   వాయిదా వేశారు.  అయితే   మార్చి  5న  నిర్వహించిన  అసిస్టెంట్  ఇంజనీర్ పరీక్షలకు సంబంధించిన  పేపర్ లీక్ అయిందని  పోలీసులు గుర్తించారు . అయితే ఈ పేపర్ లీక్ అంభానికి సంబంధించి  పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.   టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశానికి సంబంధించి  విచారణకు  గాను  ప్రభుత్వం సిట్ ను  ఏర్పాటు  చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios