Asianet News TeluguAsianet News Telugu

అందమైన విగ్గుతో.. అతివలకు వల.. ఎన్నారై ఫోజు, సహజీవనం చేసి..

ఎన్నారై పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

NRI fake groom cheats woman in instagram arrested in hyderabad
Author
Hyderabad, First Published Nov 11, 2021, 8:15 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమీర్ పేట :  తనకు తాను ఎన్నారైగా చెప్పుకొని ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన మహిళలతో సహజీవనం చేసి నగదు, నగలు దోచుకుపోతున్న ప్రబుద్ధుడు పోలీసులకు చిక్కాడు.  ఇటీవల కేపీహెచ్ బీకాలనీకి చెందిన మహిళ (33)కు ఇంస్టాగ్రామ్ లో కార్తీక్ వర్మ పేరుతో పరిచయమైన షేక్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమె దగ్గర నుంచి 18.5 తులాల బంగారు ఆభరణాలు,  రూ.70 వేల నగదు స్వాహా చేసి ఉడాయించిన విషయం తెలిసిందే.

victim పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు  రఫీని పట్టుకున్నారు. అతని వేషం, అవతారం చూసి ముందుగా పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఆ తరువాత Interrogationలో వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

మరికొందరు బాధితులు

రఫీ ది తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామం.  కేపీహెచ్ బీ కాలనీకి చెందిన బాధితురాలితో పాటు మరో నలుగురు womenను ఇలాగే 
Cheating చేసినట్లు పోలీసులు గుర్తించారు.  పదవ తరగతి వరకు చదువుకున్న రఫీ పాలిటెక్నిక్ మధ్యలో వదిలేశాడు. 2010లో నగరానికి చేరుకుని పలుచోట్ల కార్మికుడిగా పని చేశాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  జల్సాలకు అలవాటుపడి భార్యను Harassement చేస్తుండటంతో ఆమె ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా గూడూరులో కేసు నమోదైంది. అప్పటినుంచి రఫీ  మధురానగర్ లో ఒంటరిగా ఉంటున్నాడు.

ప్రేమోన్మాది ఘాతుకం: పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలిపై దాడి , 18 కత్తిపోట్లు.. చావు బతుకుల్లో యువతి

అందంగా ఫోటోలు పెట్టి..
భార్య నుంచి దూరమైన  నిందితుడు  జల్సాల కోసం మహిళలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. Instagramలో తన పేరు  కార్తీక్ వర్మగా పెట్టుకుని మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. అతని అందమైన రూపానికి మహిళలు ఈజీగా అతనికి ఆకర్షితులయ్యేవారు. తన పథకం పారిందని నమ్మకం కలగగానే.. అమెరికాలో పుట్టిన  NRIగా  నమ్మించేవాడు. ఇంకేం  మహిళలు ఇంకాస్తగా అతని వలలో చిక్కేవారు. ఆ పరిచయాన్ని మెల్లిగా ప్రేమ,Live-in Relationshipలోకి మార్చేవాడు. వారితో కొంతకాలం సహజీవనం చేసి తరువాత అసలు స్వరూపం బయట పెట్టే వాడు.

వధువు ప్రేమ.. వరుడి ప్రాణం తీసింది.. దారుణంగా చంపి, కత్తులు వాగులో పడేసి..

తన అవసరాలకు డబ్బు అవసరమని మహిళల నుంచి  అందినంత డబ్బు, నగలు తీసుకుని  ఉడాయించేవాడు.  కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో accussed డొంక కదిలింది. ఎట్టకేలకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

అయితే విచారణలో భాగంగా.. అనేక కొత్త విషయాలు వారికి తెలిశాయి. నిందితుడికి బట్టతల ఉంది. దాన్ని అందమైన విగ్గుతో కవర్ చేసి.. హ్యాండ్ సమ్ గా  ఫోటోలు పెట్టి మహిళలకు వల వేసేవాడని తెలిసి అతని తెలివికి ఆశ్చర్యపోయారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని విగ్గు పెట్టుకున్నట్లు తెలిసి అవాక్కయ్యారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios