ఇకపై వాట్సాప్ ద్వారా హైదరాబాద్ మెట్రో టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..

హైదరాబాద్ మెట్రో‌ రైలులో ప్రయాణించేవారికి ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేవారు.. ఇకపై వాట్సాప్ ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. 

now you can book hyderabad metro tickets through whatsapp where is the procedure

హైదరాబాద్ మెట్రో‌ రైలులో ప్రయాణించేవారికి ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేవారు.. ఇకపై వాట్సాప్ ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. గత కొన్ని నెలలుగా అనేక ట్రయల్స్ తర్వాత.. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ బిల్‌ఈజీ, సింగపూర్‌కు చెందిన ShellinfoGlobalsgతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వాట్సాప్ ద్వారా పూర్తి డిజిటల్ చెల్లింపుతో ఇ-టికెట్ పొందవచ్చని.. దేశంలోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన మొదటి మెట్రో రైల్‌గా తాము నిలిచామని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఇతర డిజిటల్ టిక్కెట్ సౌకర్యాల మాదిరిగానే ప్రయాణికులు తమ ఇ-టికెట్‌ను ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల వద్ద మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుంది. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే ప్రయాణీకులను TSavaari అధికారిక సహచర యాప్‌తో పాటు ఇతర థర్డ్-పార్టీ అప్లికేషన్‌లను ఉపయోగించి టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. “హైదరాబాద్ మెట్రో రైల్ డిజిటలైజేషన్ శక్తిని విశ్వసిస్తుంది. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా.. పూర్తి డిజిటల్ చెల్లింపు గేట్‌వేతో భారతదేశపు మొట్టమొదటి మెట్రో వాట్సాప్ ఇ-టికెటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది ”అని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేవీబీ రెడ్డి అన్నారు.

మరి ప్రయాణికులు వాట్సాప్  ద్వారా టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.. హైదరాబాద్ మెట్రో రైలుకు +91 8341146468లో ‘Hai’ సందేశాన్ని పంపడం ద్వారా WhatsApp చాట్‌ని ప్రారంభించాల్సి ఉంటుంది. లేదా మెట్రో స్టేషన్‌లలో ప్రదర్శించబడే QR కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇ-టికెట్ బుకింగ్ లింక్‌తో పాటు ఐదు నిమిషాల పాటు చెల్లుబాటు అయ్యే OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. ఇ-టికెట్ గేట్‌వే వెబ్‌పేజీని తెరవడానికి ఇ-టికెట్ బుకింగ్ లింక్‌ని క్లిక్ చేయాలి. 

తర్వాత మీరు.. జర్నీ రూట్(ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్ల పేర్లు), జర్నీ టైప్ ఎంచుకోవాలి. తర్వాత గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీమ్, రూపే డెబిట్ కార్డ్ లేదా అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర చెల్లింపు ఎంపికను ఉపయోగించి చెల్లింపు చేయాలి. వెంటనే మీరు మీ రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్‌లో మెట్రో ఇ-టికెట్ లింక్‌ని పొందుతారు. క్యూఆర్ కోడ్ రూపంలో ఇ-టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక పని దినం వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ వద్ద QR ఇ-టికెట్‌ను ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios