Asianet News TeluguAsianet News Telugu

టిఎస్పిఎస్సీ పై భాషా పండిట్ల ఆగ్రహం

టిఎస్పిఎస్సీ తీరుపట్ల రోజుకో విభాగం అభ్యర్థులు పోరుబాట పడుతున్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అన్నీ జరగకపోవడంతో అన్ని విభాగాల అభ్యర్థులు ఉసూరుమంటున్నారు. నిన్నమొన్నటి వరకు గ్రూప్ 2 అభ్యర్థులు  టిఎస్సిఎస్సీపై విమర్శల వర్షం గుప్పించారు. ఆ తర్వాత గురుకుల టీచర్ అభ్యర్థులు పైతం ఆందోళనబాట పట్టారు. తాజాగా అదే గురుకుల పరీక్షల విషయంలో భాషా పండిట్లు లబోదిబోమంటున్నారు.

now language teachers on war path with TSPSC

గురుకుల పిజిటి, టిజిటి, పిడి మెయిన్స్ ను వాయిదా వేస్తూ సవరించిన షెడ్యూల్ ను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ భాషా పండిట్ల విషయాన్ని మరచిపోయింది. వారికి మెయిన్స్ పరీక్ష ఎప్పుడనే విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. మ్యాథ్స్‌, బయాలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు మెయిన్స్‌ ఎప్పుడు నిర్వహించేది క్లారిటీ ఇవ్వడంతో వారంతా ప్రిపరేషన్ లో ఉన్నారు. కానీ భాషా పండితులైన తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు మెయిన్స్‌ విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేదని ఆ విభాగం వారు ప్రశ్నిస్తున్నారు.


మే 31న ప్రలిమినరీ జరిపిన టిఎస్సిఎస్సీ దానికి సంబంధించిన ప్రాథమిక కీ ని రెండు రోజుల్లోనే విడుదల చేసింది. కానీ లాంగ్వేజెస్‌కు స్క్రీనింగ్‌ టెస్ట్‌ పూర్తయి వారం గడుస్తున్నా ఇంకా ‘కీ’ విడుదల చేయలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేడో రేపో  టిజిటి, పిజిటిల ప్రిలిమినరీ ఫలితాలు రానున్నట్లు తెలుస్తుండగా తమకు ఇప్పటి వరకు ప్రాథమిక కీ కూడా విడుదల చేయకపోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

 

వెంటనే టీఎస్‌పీఎస్సీ లాంగ్వెజెస్‌క ప్రిలిమినరీ టెస్ట్‌ ‘కీ’ని విడుదల చేయాలని కోరుతున్నారు. తక్షణమే మెయిన్స్ పరీక్ష తేదీలను సైతం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము సైతం పోరుబాట తప్పదని భాషా పండిట్లు హెచ్చరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios