కేసిఆర్ కే కాదు కోమటిరెడ్డికీ మొదలైందిగా (వీడియో)

First Published 17, Apr 2018, 6:31 PM IST
Not only kcr komatireddy also basks in milk bath culture
Highlights

కాంగ్రెస్ పార్టీలో కొత్త ట్రెండ్

నిన్నమొన్నటి వరకు తెలంగాణలో ఎక్కడ చూసినా కేసిఆర్ ఫొటోలకు పాలాభిషేకం చేశారు. జేబులో ఉన్న పాల పాకీట్ కత్తిరించడం.. కేసిఆర్ ఫొటో మీద కుమ్మరించడం రొటీన్ గా జరిగాయని విమలక్క లాంటి వాళ్లు సెటైర్లు కూడా వేశారు. కేసిఆర్ నిర్ణయం తీసుకుని ప్రకటించడమే ఆలస్యం పాల పాకిట్లు కత్తిరించేవారు.

తాజాగా ఇప్పుడు కోమటిరెడ్డికి సైతం పాల పాకిట్లు కత్తిరించుడు షురూ చేశారు. నల్లగొండలో కోమటిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల పాకిట్లు కత్తిరించి కోమటిరెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేశారు.

హైకోర్టులో తెలంగాణ సర్కారుకు షాక్ ఇచ్చే తీర్పు రావడం.. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాల రద్దు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలో నల్లగొండ టౌన్ లో కాంగ్రెస్ లీడర్లు పాలాభిషేకానికి పూనుకున్నారు.

పాల పాకిట్ల కత్తిరింపు కల్చర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి సైతం ఎంటరైందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

loader