Asianet News TeluguAsianet News Telugu

నాగార్జునసాగర్లో పోటీ చేయాలని నన్ను ఎవరూ అడగలేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తనను ఎవరూ సంప్రదించలేదని శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
 

None asked me to contest in Nagarjunasagar bypoll says gutta sukender reddy lns
Author
Hyderabad, First Published Jan 3, 2021, 10:55 AM IST

హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తనను ఎవరూ సంప్రదించలేదని శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.

శనివారం నాడు హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడారు.  సాగర్ లో స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం అర్ధరహితమని ఆయన చెప్పారు. నేతలంతా హైద్రాబాద్ లో ఉంటూ నియోజకవర్గాలకు వచ్చిపోతున్నారని ఆయన తెలిపారు.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తరహాలో నాగార్జునసాగర్ ఫలితం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లా రాజకీయ పరిస్థితులు వేరని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఎవరికీ ఎవరూ పోటీ కాదన్నారు.

సీఎం పదవికి కేటీఆర్ కు అన్ని రకాల అర్హతలున్నాయని ఆయన చెప్పారు. శాసనమండలి ఛైర్మెన్ పదవితో తాను సంతృఫ్తిగానే ఉన్నానని ఆయన తెలిపారు. 

ఏడాది జూన్ మాసంలో సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదని సుఖేందర్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:నాగార్జునసాగర్ బైపోల్: గెలుపు గుర్రం కోసం టీఆర్ఎస్ సర్వే, వ్యూహాత్మక అడుగులు

ఈ ప్రకటన చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తనను ఎవరూ కోరలేదని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ స్థానం నుండి  జానారెడ్డి కుటుంబం నుండి అభ్యర్ధిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుంది.

సుఖేందర్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్ధిగా ఉంటాడనే టీఆర్ఎస్ నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారని సమాచారం.  నాగార్జునసాగర్ కు చెందిన  టీఆర్ఎస్ నేతలు కూడ ఈ స్థానంలో పోటీకి ఆసక్తిగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios