Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ తో విభేదాల్లేవ్.. పదవుల కోసం ఎప్పుడూ పరుగెత్తలేదు : ఈటల రాజేందర్

Hyderabad: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. తాను గతంలో ఎన్నడూ రాజకీయ పదవుల కోసం ప్రయత్నించలేదనీ, భవిష్యత్తులో కూడా అలా చేయాలనే ఉద్దేశం లేదని ఈటల స్పష్టం చేశారు.

No rift with Bandi Sanjay Kumar, Telangana BJP leadership intact: Huzurabad BJP MLA Eatala Rajender RMA
Author
First Published May 25, 2023, 6:00 PM IST

Huzurabad BJP MLA Eatala Rajender: ఇటీవల తనకు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కుమార్ కు మధ్య విభేదాలు ఉన్నాయని మీడియాలో వచ్చిన వార్తలను హుజూరాబాద్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్  తోసిపుచ్చారు. అలాగే, బీజేపీది చెక్కుచెదరని నాయకత్వమని పేర్కొన్నారు.

వివరాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. తాను గతంలో ఎన్నడూ రాజకీయ పదవుల కోసం ప్రయత్నించలేదనీ, భవిష్యత్తులో కూడా అలా చేయాలనే ఉద్దేశం లేదని ఈటల స్పష్టం చేశారు. తనకు, బండి సంజయ్ కి మధ్య విభేదాలు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నాయకత్వాన్ని మార్చాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర నేతలు డిమాండ్ చేయడంతో తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ పై అసమ్మతి ఊహాగానాలు చెలరేగాయి. దీని గురించి రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.

బండి సంజయ్ కఠిన హిందుత్వ వైఖరితో విభేదించిన పలువురు అసంతృప్త బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. బండి సంజయ్ విధానాలు ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలమవుతున్నాయనీ, తెలంగాణలో ఒక మితవాద నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని నేతలు సూచించారని సంబంధిత కథనాలు పేర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో  ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ వార్తలు అవాస్తవమనీ, బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీ తెలంగాణ శాఖ నిర్మాణంలో మార్పులను ఎంచుకోదని ఈటల స్పష్టం చేశారు. శామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ తాను గతంలో ఏ రాజకీయ పదవిని కోరలేదనీ, భవిష్యత్తులో కూడా ఆ పదవిని ఆశించలేదని స్పష్టం చేశారు. 

పార్టీ కేంద్ర నాయకత్వం వారి ప్రణాళికలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందనీ, బండి సంజయ్ కుమార్ కృషిని అభినందించిన ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో పార్టీ నాయకుల సమిష్టి బలాన్ని ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. బీజేపీ సీనియర్ నేతలకు, ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వారికి మధ్య తలెత్తిన విభేదాలను ప్రస్తావిస్తూ, ఈ ఘర్షణలు సాధారణమేననీ, కేంద్ర నాయకత్వం ఆదేశాలను ప్రభావితం చేయవనీ, పార్టీ సభ్యుల మధ్య ఐక్యత అయితే కొనసాగుతుందని ఈటల రాజేందర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios