హైదరాబాద్: నగర వాసులకు శుభవార్త. నగరానికి వర్షం ముప్పు తగ్గనుంది. రేపటి నుండి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్టుగా హైద్రాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

also read:వారంలోనే హైద్రాబాద్‌లో 700 మి.మీ. వర్షం: రజత్‌కుమార్

వచ్చే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  ఈ నెల 22 వ తేదీ నుండి హైద్రాబాద్ లో వర్షాలు తగ్గు ముఖం పట్టనున్నట్టుగా హైద్రాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

also read:హైద్రాబాద్‌‌లో భారీ వర్షాలు, కూలిన గోల్కోండ గోడ: పురాతన కట్టడాలకు దెబ్బేనా?

ఈ నెల 13వ తేదీన  రాత్రి హైద్రాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. వారం రోజులుగా నగర వాసులను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నెల 17వ తేదీన కురిసిన వర్షం కూడ నగరాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. నగరంలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి.