హైద్రాబాద్‌‌లో భారీ వర్షాలు, కూలిన గోల్కోండ గోడ: పురాతన కట్టడాలకు దెబ్బేనా?

First Published 21, Oct 2020, 1:57 PM

హైద్రాబాద్ నగరాన్ని భారీ వర్షాలు  ముంచెత్తాయి. ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు నగరంలోని పురాతన కట్టడాలకు కూడ ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

భారీ వర్షాలతో హైద్రాబాద్ నగరంలో పురాతన కట్టడాలపై అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.  మరో రెండు మూడు రోజుల్లో కూడ వర్సాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నెల 13వ తేదీ కంటే ముందుగా రెండు రోజుల పాటు కూడ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు చెరువుల్లోకి వరద నీరు చేరింది. వరద నీరు దిగువకు విడుదల చేయడంతో నగరంలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి.

భారీ వర్షాల కారణంగా  గోల్కోండ కోట దెబ్బతింది.  గోడ కూలిపోయింది. జగదాంబిక దేవాలయం పక్కన ఉన్న గోడ కూలిపోయింది.  ఈ కోట గోడ నిర్మించి 500 ఏళ్లు అవుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.

మరో వైపు ఈ ఏడాది జూన్ మాసంలోనే చౌమల్లా ప్యాలెస్ కిటీకి దెబ్బతింది. కిటీకి భాగం కిందపడిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పురాతన కట్టడానికి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. కిటీకి దెబ్బతిన్న సమయంలోనే భవనం నాణ్యతను అధికారులు పరిశీలించారు.1750లో దీన్ని నిర్మించారు.

ఈ వర్షాలతో ఇప్పటికే జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్ లో సర్దార్ సర్వాయ్ పాపన్న నిర్మించిన కోటగోడ కూలిపోయింది. ఈ నెల 14వ తేదీన ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

చార్మినార్ మీనార్ నుండి మట్టిపెళ్లలు గత ఏడాది జూన్ మాసంలో కిందపడ్డాయి.ఆ సమయంలో వర్షాలతో పాటు ఇతరత్రా కారణాలతో మట్టిపెళ్లలు కిందపడిపోవచ్చని ఆ సమయంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ మీనార్ ను పరిశీలించిన అధికారులు గత ఏడాది జూలై, ఆగష్టు మాసంలో మరమత్తులు చేశారు.

భారీ వర్షాల కారణంగా 428 ఏళ్ల క్రితం నిర్మించిన చార్మినార్ కు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా.. అనే కోణంలో అధికారులు  ఆరా తీస్తున్నారు. పాతబస్తీలో భారీ వర్షం కురిసింది. చార్మినార్, పురానాపుల్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

హుస్సేనీ ఆలం ప్రాంతంలో వందేళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం  ఇటీవల కూలిపోయింది. దీంతో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20వ తేదీ వరకు సుమారు 165 శిథిలావస్థకు చేరిన ఇళ్లను కూల్చివేశారు.2016 లో 485 ,2017లో 294 , 2018లో 402 ఇళ్లు, 2019లో 176 ,2020లో 120 పురాతన ఇళ్లను కూల్చివేశారు.

భారీ వరదల కారణంగా పురానపూల్ బ్రిడ్జి కొద్దిగా దెబ్బతిందని సమాచారం. మూసీ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. మరోవైపు మూసారాంబాగ్ బ్రిడ్జి కూడ దెబ్బతింది. మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుండి మూసీ ప్రవహించింది. దీంతో ఈ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.