వారం రోజుల వ్యవధిలోనే  700 మి.మీ వర్షపాతం నమోదైందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ చెప్పారు.


హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలోనే 700 మి.మీ వర్షపాతం నమోదైందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ చెప్పారు.

ప్రతి ఏటా సగటున 800 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది కేవలం వారం రోజుల్లోనే 700 మి.మీ వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు.

బుధవారం నాడు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులకు గండ్లు పడకుండా అధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్టుగా ఆయన తెలిపారు. 

also read:హైద్రాబాద్‌‌లో చెరువు కట్టలు తెగకుండా జాగ్రత్తలు: కేసీఆర్

నగరంలోని చెరువుల కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఇవాళ రజత్ కుమార్ కు ఫోన్ చేసి నగరంలో చెరువుల కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చెరువులను నిరంతరం మానిటరింగ్ చేసేందుకు 15 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

సీఎం సూచన మేరకు 15 మందితో బృందాలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. చెరువులను పరిశీలించిన తర్వాత మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు.

నగరంలోని 53 చెరువులు దెబ్బతిన్నాయని చెప్పారు.