హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాపై మాట్లాడేందుకు తెలంగాణ మంత్రి,. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిరాకరించారు. నో పొలిటిక్స్ అంటూ ఈటెల వ్యవహారంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రేపు శనివారం రాజీనామా చేయనున్నారు.

ఆ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు కేటీఆర్ నో పొలిటిక్స్ అంటూ సమాధానం దాటవేశారు. తాను కేవలం ఆరోగ్య శాఖ గురించి మాత్రమే మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఇతర దేశాల నుంచి కేంద్రం వ్యాఖ్యని తెప్పించాలని ఆయన అన్నారు. 

Also Read: ఆత్మగౌరవం కాదు ఆస్తులపై గౌరవం: ఈటలకు టీఆర్ఎస్ కౌంటర్

అందరికీ వాక్సినేషన్ చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల వల్ల కరోనా వాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని ఆయన విమర్శించారు 

తాను టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఈటెల రాజేందర్ శుక్రవారంనాడు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన మీడియా సమావేశంలో తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.