Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ హామీల‌ను ఎవ‌రూ న‌మ్మ‌రు.. బీజేపీదే విజ‌యం : ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్

Hyderabad: బీఆర్ఎస్ మేనిఫెస్టో విలువ‌లేనిద‌నీ, తెలంగాణలో ప‌క్కా బీజేపీదే విజయమ‌ని ఆ పార్టీ నాయ‌కుడు ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అయితే, బీఆర్ఎస్ ఆదివారం ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. అందులో రూ.400కే ఎల్పీజీ సిలిండర్లు అందిస్తానీ, రైతుబంధు పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సాయాన్ని పెంచుతామనీ, మ‌హిళ‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపింది.
 

No one believes in the BRS guarantees,  BJP will win: Prakash Javadekar RMA
Author
First Published Oct 16, 2023, 10:04 AM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. అందులో రూ.400కే ఎల్పీజీ సిలిండర్లు అందిస్తానీ, రైతుబంధు పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సాయాన్ని పెంచుతామనీ, మ‌హిళ‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపింది. మరోసారి ఎన్నికైతే సామాజిక భద్రత పెన్షన్‌ను పెంచుతామని అధికార పార్టీ పేర్కొంది. అయితే, బీఆర్ఎస్ త‌మ హామీల‌ను కాపీ కొట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, బీజేపీ సైతం విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో విలువ‌లేనిద‌నీ, తెలంగాణలో ప‌క్కా బీజేపీదే విజయమ‌ని ఆ పార్టీ నాయ‌కుడు ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తన మేనిఫెస్టోను విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ ఆదివారం ఆ పార్టీ మేనిఫెస్టోకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామ‌నీ, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు. అధికార పార్టీ ఎన్నికల హామీలపై జవదేకర్ స్పందిస్తూ, "బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పూర్తిగా విలువలేనిది. రాష్ట్రంలోని దళితులందరికీ రూ.10 లక్షలు ఇస్తామని చెప్పిన పార్టీ ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలకు 30 శాతం కమీషన్ ఇచ్చి వాగ్దానం చేసిన కొంత మంది దళితులకు మాత్రమే అందింది. దళితులు, ఆదివాసీలకు భూమి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని" పేర్కొన్నారు.

అలాగే, "10 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఆ హామీ కూడా నెరవేరలేదు. నిరుద్యోగ యువకులకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అందువల్ల, వారి వాగ్దానాలు ఇప్ప‌టికీ ఖాళీగా ఉన్నాయి.  అందుకే బీఆర్ఎస్ హామీల‌ను ఎవరూ నమ్మరు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో పాటు కాంగ్రెస్ మూడో స్థానంలో నిలవడం ఖాయం" అని జవదేకర్ అన్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల మొద‌టి జాబితాను బీజేపీ అక్టోబర్ 18న విడుదల చేయ‌నుంది. "రాష్ట్రంలో ఇప్పటికే అభ్యర్థుల స్క్రీనింగ్ పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో సహా కీల‌క నేత‌లు మ‌రోసారి అక్టోబర్ 17న సమావేశం కానున్నార‌ని" సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios