Asianet News TeluguAsianet News Telugu

అంతర్రాష్ట్ర ఒప్పందం: ఏపీ రవాణా మంత్రితో భేటీ అవ్వలేదు.. వెల్లడించిన టీఎస్ఆర్టీసీ

ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి సమావేశం ఫిక్స్ చేయలేదని ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. కిలోమీటర్ల బేసిస్‌లో తెలుగు రాష్ట్రాల అధికారుల ఒప్పందం తర్వాతే భేటీ అవుతామని ప్రకటించింది. ప్రస్తుతం అధికారుల స్థాయిలో మాత్రమే సమావేశాలు ఉంటాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. 

no meeting with ap transport minister : tsrtc
Author
Hyderabad, First Published Sep 12, 2020, 3:42 PM IST

ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి సమావేశం ఫిక్స్ చేయలేదని ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. కిలోమీటర్ల బేసిస్‌లో తెలుగు రాష్ట్రాల అధికారుల ఒప్పందం తర్వాతే భేటీ అవుతామని ప్రకటించింది. ప్రస్తుతం అధికారుల స్థాయిలో మాత్రమే సమావేశాలు ఉంటాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ విషయమై రెండుు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. 1.52 లక్షల కి.మీ. మాత్రమే బస్సులు నడుపుతామని  తెలంగాణ చెబుతోంది.

ఈ ఏడాది మార్చి 22 వ తేదీ నుండి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కరోనా నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను నిలిపివేశారు.

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్దరించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య బస్సుల సర్వీసులను నడిపే విషయంలో రెండు రాస్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయమై రెండు రాష్ట్రాల అధికారులు పలుమార్లు చర్చించారు. కానీ ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు.

Also Read:ఏపీ, తెలంగాణల మధ్య కుదరని సయోధ్య: కదలని ఆర్టీసీ బస్సులు

2014-19 మధ్య కాలంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ముగిసింది. దీంతో కొత్తగా అగ్రిమెంట్ చేసుకొందామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

తమకు నష్టాలు ఎక్కువగా వస్తున్నందున 1.52 లక్షల కి.మీ మాత్రమే బస్సులను నడుపుతామని ఏపీకి తెలంగాణ ప్రభుత్వం తెగేసీ చెప్పింది.  ఏపీ ప్రభుత్వం తాము తెలంగాణలో 2.10 లక్షల కి.మీ నడుపుతామని చెప్పింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించడం లేదు. కొత్తగా ఒప్పందం చేసుకొందామని ఏపీకి తెలంగాణ ప్రతిపాదిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios