దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల దోషుల శిక్ష అమలు అయోమయం తెలంగాణ జైళ్లలలో ఉరి తీయడానికి వసతులే లేవు ఏపీలోని రాజమండ్రి సెంట్రల్ జైలు ఒక్కటే ప్రత్యామ్నాయం

హైదరాబాద్ బాగా డెవెలప్ అయింది అనుకుంటున్నాం కానీ... అబ్బే వాస్తవంగా అంత లేదు అనిపిస్తోంది. ప్రభుత్వానికి వచ్చిన ఈ సమస్య చూస్తుంటే.

దిల్‌సుఖ్‌నగర్ లో బాంబులు పేల్చి అమాయకులను పొట్టన పెట్టుకున్న నరహంతకులకు తాజాగా ఎన్ ఐ ఏ ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే.

అయితే ఈ తీర్పు తెలంగాణ జైళ్ల శాఖ తలమీదికి వచ్చింది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా ఉరి తీసే అవకాశం ఉన్న జైళ్లే లేవట. ఇక్కడున్న రెండు సెంట్రల్ జైళ్లలో ఉరికంబం లేదు.

ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే.తెలుగు రాష్ట్రాలలో అక్కడ ఒక్క దగ్గరే ఉరికంబం ఉంది.

గతంలో చంచల్‌గూడ, వరంగల్ సెంట్రల్ జైళ్లకు ఉరికంబాలు కావాలని జైళ్ల శాఖ ప్రతిపాదన పంపింది.కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

దేశంలోని ప్రతి రాష్ట్రంలోని సెంట్రల్ జైళ్లలో ఉరి కంబం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజమండ్రి జైళ్లోనే ఉరికబం ఏర్పాటు చేశారు. 

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ లో ఉరికంబం ఏర్పాటు చేయడం మరిచిపోయారు.

దీంతో ఇప్పుడు ఉరికంబం కోసం తెలంగాణ జైళ్ల శాఖ ఆంధ్రా వైపు చూస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలును కాసేపు వాడుకోడానికి అనుమతిస్తారేమోనని ఆశగా చూస్తోంది.