తనపై  వచ్చిన  లైంగిక  వేధింపుల ఆరోపణలను  బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం  చిన్నయ్య  ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే  ఈ ఆరోపణలు  చేశారనన్నారు.  

ఆదిలాబాద్: తనపై లైంగిక వేధింపులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆరోపణలు చేశారన్నారు. రైతుల నుండి లక్షలాది రూపాయాలను వసూలు చేసిన ఆరిజన్ డెయిరీ సంస్థపై కేసులు నమోదైన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తనపై ఉద్దేశ్యపూర్వకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. తనపై బురద చల్లుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. తాను దళితుడినని బీజేపీ వాళ్లు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను తప్పు చేయలేదన్నారు.వాట్సాప్ చాటింగ్ తనది కాదన్నారు.తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఎవర్నీ లైంగికంగా వేధింపులకు గురి చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. 

also read:బెల్లంపల్లి ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్యాబ్లెట్లు కావాలా? అమ్మాయిల కోసం కోడ్ భాషలో ఛాటింగ్ ..

ఓ ప్రైవేట్ డెయిరీ సంస్థ కు చెందిన మహిళ ఎమ్మెల్యే చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపఫలు చేశారు. తమ సంస్థలో పనిచేసే అమ్మాయిని పంపాలని ఎమ్మెల్యే వేధింపులకు దిగారని కూడా ఆ మహిళ ఆరోపణలు చేశారు.ఈ విషయమై ఆమె మీడియాకు చెప్పారు. 

హైద్రాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యేకు అన్ని రకాల సపర్యలు చేసినట్టుగా ఆమె ఆరోపించారు. తమను రకరకాలుగా ఎమ్మెల్యే చిన్నయ్య ఉపయోగించుకున్నాడని ఆమె చెప్పారు. ఈ విషయాలపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు