కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: తేల్చేసిన కేంద్రం

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జతీయ హోదా కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కు  జాతీయ హోదా కల్పించే స్కీమ్ లో చేర్చే అర్హత లేదని తెలిపింది. 
 

No Eligibility To Kaleshwaram Project For national status

న్యూఢిల్లీ: kaleshwaram Project ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గురువారం నాడు పార్లమెంట్ లో ఈ విషయాన్ని కేంద్రం తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నుండి లిఖిత పూర్వకంగా కేంద్రం ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో వేసిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నుండి లిఖిత పూర్వకంగా ఈ విషయమై సమాధానం వచ్చింది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని నీటి పారుదల ప్రాజెక్టులున్నాయి, కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల ఆదేశాలను రెండు రాష్ట్రాలు పాటిస్తున్నాయా?,  కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రం నుండి ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కోరారా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ అధికారులను కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పెట్టుబడులకు అనుమతులు లేవని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని తేల్చి చెప్పింది.  ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే తొలుత సీడబ్ల్యూసీ అప్రైజ్ చేయాల్సి ఉంటుంది.  దీనికి సీడబ్ల్యూసీ అడ్వైజరీ కమిటీ కూడా అంగీకారం తప్పనిసరి. ఆ తర్వాత హైపవర్ స్టీరింగ్ కమిటీ  కూడా జాతీయ హోదా విషయమై అంగీకారం తెలపాల్సి ఉంటుంది.

 ఆ తర్వాత నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికిధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుకు హోదా కల్పించవచ్చో లేదో కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. 2016 ఫిబ్రవరి, 2018 డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదాను ఇచ్చింది.  కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం జాతీయ హోదా ఇవ్వలేదు. తెలంగాణలోని ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఉండేది. అయితే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ ను మార్చారు.

also read:Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపం వల్లనే వ‌ర‌ద‌లు.. రాష్ట్ర‌ప్ర‌భుత్వంపై ఈటల ఫైర్

ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. ప్రాణహిత-చేవేళ్ల స్థానంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పలు మార్లు కోరింది. మరో వైపు కాళేశ్వరం కాకపోతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలనే డిమాడ్ కూడా తెలంగాణ నుండి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ నుండి ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదాను కల్పించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించేందుకు గాను అర్హతే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios