హైదరాబాద్: తమ కుటుంబంలో ఆస్తి వివాదాలు లేవని మారుతీరావు సోదరుడు శ్రవణ్ కుమార్ చెప్పారు. అన్నతో ఎలాంటి విభేదాలు లేవని  ఆయన స్పష్టం చేశారు.   దాదాపుగా మే 15వ తేదీ నుండి అన్నకు తనకు మాటలు లేవన్నారు. తన పేరున రాసిన వీలునామాను కూడ క్యాన్సిల్‌ చేయించినట్టుగా శ్రవణ్ చెప్పారు.

Also read:అమ్మ దగ్గరకు వెళ్లు: అమృతకు మారుతీరావు చివరి మాటలు

ఆదివారం నాడు మధ్యాహ్నం మారుతీరావు సోదరుడు  శ్రవణ్ హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసు ట్రయల్‌ దశలో ఉందని దీంతోనే  ఆత్మహత్య చేసుకొన్నాడని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఆత్మహత్య విషయాన్ని మా వదిన నాకు ఫోన్ చేసి చెప్పిందన్నారు. వదినను తీసుకొని తాను హైద్రాబాద్‌కు వచ్చినట్టుగా ఆయన చెప్పారు.

2018 మార్చిలోనే తన పేరున అన్న ఆస్తిలో సగం వాటాను తన పేరున రాసిన విషయం తెలిసి తాను ఆ వీలునామాను  క్యాన్సిల్ చేయించినట్టుగా చెప్పారు. తనకు ప్రణయ్ కుటుంబం నుండి హాని ఉందని సమాచారంతోనే తనపేరున సగం ఆస్తిని రాసి ఇచ్చినట్టుగా శ్రవణ్ గుర్తు చేశారు. ఒకవేళ మారుతీరావు సోదరుడు  శ్రవణ్ స్పందించారు. అన్న తన పేరున రాసిన వీలునామాను క్యాన్సిల్ చేయించినట్టుగా ఆయన తెలిపారు.

 ప్రణయ్ హత్య కేసు విషయంలో తనకు సంబంధం లేకున్నా తాను ఇరికిన విషయమై అన్నతో  మాటా మాటా పెరిగిన విషయాన్ని శ్రవణ్ గుర్తు చేశారు. గత ఏడాది మే 15వ తేదీన  ఈ ఘటన చోటు చేసుకొందన్నారు. అప్పటి నుండి కోర్టు కేసులకు తాను  హాజరైనప్పటికీ ఇద్దరం కూడ మాట్లాడుకోవడం లేదని  శ్రవణ్ కుమార్ చెప్పారు.

Also read:మారుతీరావు ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు వెల్లడి

 ప్రణయ్ కేసులో ఛార్జీషీట్ ప్రేమ్ చేస్తామని చెప్పారు. అయితే ఈ విషయంలో కనీసం తమకు అడ్వకేట్‌ను నియమించుకొనే అవకాశం కూడ కల్పించలేదన్నారు.  చేయని తప్పుకు 7 నెలల 15 రోజుల పాటు శిక్షను అనుభవించాను, తన కుటుంబం కూడ అనేక ఇబ్బందులు పడిందన్నారు.
 
మిర్యాలగూడలో ఉన్న షెడ్‌లో మృతదేహం దొరికిన సమయంలో తాము కోర్టులో ఉన్నామని శ్రవణ్ గుర్తు చేసుకొన్నారు.  ఇదే విషయాన్ని మిర్యాలగూడ డిఎస్పీ తమను అడిగారన్నారు. అయితే ఈ  విషయంలో తమకు సంబంధం లేదని చెప్పినట్టుగా ఆయన  చెప్పారు.

 ఎవరు కొనుగోలు చేసుకొన్న ఆస్తులను  వాళ్లే రిజిస్ట్రేషన్ చేకయించుకొన్నామని శ్రవణ్ కుమార్ చెప్పారు.  తాము చిన్న పిల్లలం కాదు, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు.