ఉస్మానియా యూనివర్శిటీ ఆవరణలో  ఈ నెల 14వ తేదీన రాహుల్ సభ  విషయమై  ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం రాహుల్ గాంధీ సభ  అనుమతి కోసం శనివారం నాడు  ఉస్మానియా యూనివర్శిటీ వీసీ‌కి ధరఖాస్తు చేసుకొన్నారు. 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ఆవరణలో ఈ నెల 14వ తేదీన రాహుల్ సభ విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం రాహుల్ గాంధీ సభ అనుమతి కోసం శనివారం నాడు ఉస్మానియా యూనివర్శిటీ వీసీ‌కి ధరఖాస్తు చేసుకొన్నారు. మరోవైపు రాహుల్ యూనివర్శిటీకి వస్తే అడ్డుకొంటామని కొన్ని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. అయితే రాహుల్ సభకు అనుమతి లభిస్తోందా లేదా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ నెల 13, 14 తేదీల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటనను పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్శిటీ వద్ద సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాహుల్ సభను నిర్వహించకుండా అడ్డుకొంటామని కొన్ని విద్యార్ధి సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మరో వైపు ఈ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్‌యూఐ పనిచేస్తోంది.

ఓయూ ఆర్ట్స్ కాలేజీ సమీపంలో ఈ నెల 14వ తేదీన తలపెట్టిన సభను వాయిదా వేసుకొని ఠాగూర్ ఆడిటోరియంలో భారత్‌లో విద్య - ఉపాధి అనే అంశంపై రాహుల్ గాంధీ ఉపన్యాసం చేయనున్నారు. ఈ మేరకు వీసీ అనుమతించాలని కొన్న విద్యార్థి సంఘాలు కోరనున్నాయి. 

యూనివర్శిటీల్లో రాజకీయ నేతల ప్రసంగాలు అనుమతించకూడదని ఉన్నతస్థాయి నిర్ణయం ఉన్నందున ఈ విషయంలో వీసీ ఏం నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ సభ నిర్వహణ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉస్మానియా వీసీ రామచంద్రం తెలిపారు. 

"