భువనగిరి మున్సిపాలిటీలో ముసలం.. ఛైర్‌పర్సన్‌‌పై అవిశ్వాసం

First Published 4, Jul 2018, 3:21 PM IST
no confidence motion against bhongir municipal chairperson
Highlights

భువనగిరి మున్సిపాలిటీలో ముసలం.. ఛైర్‌పర్సన్‌‌పై అవిశ్వాసం

భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. ఛైర్‌పర్సన్ లావణ్యపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు.. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసును అందజేశారు. వీరిలో 15 మంది టీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ, టీడీపీ, సీపీఎం నుంచి ఒక్కో కౌన్సెలర్ ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్ అనితా రామచంద్రన్ స్పందిస్తూ.. నెల రోజుల్లో అవిశ్వాసంపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని.. 15 పనిదినాల్లో వారందరికీ నోటీసులు అందిస్తామని తెలిపారు.. 
 

loader