Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ లో ఉగ్రలింకుల కలకలం: పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ అరెస్ట్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఉగ్రవాద లింకులు బటయపడ్డాయి. సిమీ అనుబంధ సంస్థ పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాదర్ పలువురు యువకులకు శిక్షణ ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ఆటోనగర్ లో శిక్షణ ఇచ్చారని పోలీసులు గుర్తించారు. 

Nizambad Police Arrested PFI Traineer khadar
Author
Hyderabad, First Published Jul 6, 2022, 10:16 AM IST

నిజామాబాద్: ఉమ్మడి Nizambad జిల్లాలో మరోసారి ఉగ్రలింకులు బయటపడ్డాయి. SIMI  అనుబంధ సంస్థ PFI  ట్రైనర్ ఖాదర్ ను పోలీసులు Arrest చేశారు. ఈ విషయమై నిజామాబాద్ పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. 

పీఎఫ్ఐ ట్రైనింగ్ పేరుతో మత ఘర్షణలకు కుట్రకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ఆటోనగర్ లో ట్రైనింగ్  చేసినట్టుగా గుర్తించారు. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు నిజామాబాద్ పోలీసులు. మారణాయుధాలు, నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ శిక్షణలో పలు ప్రాంతాలకు చెందిన యువకులు పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. జగిత్యాల, హైద్రాబాద్, కర్నూల్, కడపకు చెందిన యువకులు పాల్గొన్నారని పోలీసులు  తెలిపారు.

కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సంస్థ సంచలనం సృష్టించిన కేసులకు పాల్పడినట్టుగా నిజామాబాద్ పోలీసులు గుర్తించారు. ఖాదర్ ను పోలీసులు  మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మత ఘర్షణలను పాల్పడడడంతో పాటు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా యువకులరు శిక్షణ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. కరాటే శిక్షణ పేరుతో యువతకు  పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చిందని నిజామాబాద్ సీపీ నాగరాజు చెప్పారు. పీఎఫ్ఐ ట్రాప్ లో పడొద్దని పోలీసులు చెప్పారు. ఇతర రాస్ట్రాల్లో పీఎఫ్ఐ నిషేధం ఉందని ఆయన గుర్తు చేశారు. 

పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ తో పాాటు పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సైపుల్లా తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా నిజామాబాద్ సీపీ నాగరాజు చెప్పారు. పీఎఫ్ఐ శిక్షణ పొందిన వారి వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏదైనా ఘర్షణలు జరిగిన సమయంలో పీఎఫ్ఐ సంస్థ సభ్యులు దాడులకు తెగబడుతారని సీపీ నాగరాజు చెప్పారు. అవసరమైతే పోలీసులపై దాడులు  చేసేందుకు కూడా వెనుకాడరని ఆయన చెప్పారు.

పీఎఫ్ఐ షెల్టర్ జోన్ జగిత్యాల అని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మత ఘర్షణలు జరిగినప్పుడు భౌతిక దాడులు ఎలా చేయలన్నదానిపై పీఎఫ్ఐ శిక్షణ ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నిన్న పీఎఫ్ఐ అధ్యక్షుడు తనను చంపుతామని బెదిరించాడని బండి సంజయ్ ఆరోపించారు. పీఎఫ్ఐ ర్యాలీలో గతంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే తన భర్త కరాటే శిక్ష ఇస్తాడని మత విద్వేషాలు  రెచ్చగొట్టేలా శిక్షణ  ఇవ్వడని  ఖాదర్ భార్య జుబేదా చెప్పారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. తన భర్తపై తప్పుడు  కేసులో అరెస్ట్ చేశారన్నారు. నిజామాబాద్ లో తన భర్త కరాటే శిక్షణ నిలిపివేశారన్నారు. జగిత్యాలలో ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios