తెలంగాణ ఎన్నికల్లో ప్రచార యుద్దం కాస్తా వ్యక్తిగత యుద్దానికి దారితీస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబంపై మాజీ ఎంపి, కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలు తన పరువుకు భంగం కలింగించేలా ఉన్నాయంటూ నిజామాబాద్ ఎంపీ కవిత ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఒక్కసారిగా నిజామాబాద్ రాజకీయాలు వేడెక్కాయి.  

తమ కుటుంబం, వ్యక్తిగత ప్రతిష్టతో పాటు రాజకీయ పరపతి దెబ్బతిసైలా యాష్కి ఆరోపణలు చేసినందున అతడిపై చట్టపరమైన చర్యలు  తీసుకుంటున్నట్లు కవిత తెలిపారు. అందుకోసమే ఆయనకు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపారు. తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసిన యాష్కి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే ఆయన్ని చట్టపరంగానే ఎదుర్కుంటానని కవిత హెచ్చరించారు. 

 కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం తెలంగాణలో దోచుకున్న డబ్బు విదేశాల్లో దాచుకుంటున్నారని గతంలో మధుయాష్కి ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవిత తన అక్రమ సంపాదనతో బెంగళూరులో విలాసవంతమైన విల్లాలు కొనుక్కున్నారని యాష్కి ఆరోపించారు. అంతేకాదు ఆమెను తెలంగాణ శశికళ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కవిత కూడా అడ్డగోలగా సంపాదించారని విమర్శించారు.  వారి బండారాన్ని మరిన్ని ఆధారాలతో త్వరలో బైటపెడతానని కూడా యాష్కి హెచ్చరించారు.

ఈ విధంగా యాష్కి తనపై, తన కుటుంబంపై చేసిన ఆరోపణలపై కవిత తాజాగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని చట్టపరంగానే గానే ఎదుర్కోవాలి నిర్ణయించుకుని యాష్కికి లీగల్ నోటీసులు పంపించినట్లు కవిత వెల్లడించారు. 

మరిన్ని వార్తలు

కేసీఆర్ నల్లధనం విదేశాలకు తరలించేది ఇతడే...ఫోటో బయటపెట్టిన యాష్కి

 ఆస్తులపై సంచలనం: కేటీఆర్ అసలు పేరు చెప్పిన యాష్కీ