తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం నిలువునా దోచుకుని...ఆ డబ్బును విదేశాల్లో దాచుకుంటున్నారని మాజీ ఎంపి, కాంగ్రెస్ నాయకులు మధుయాష్కి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ తో పాటు ఆయన కొడుకు, కూతురు, మేనళ్లుడు కాంట్రాక్టర్లు, సినీ నిర్మాతలు, పారిశ్రామిక వేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా దోచుకున్న డబ్బులను విదేశాలకు తరలించడానికి కేసీఆర్ కు సత్యం రామలింగ రాజు తనయుడు సత్యం తేజ్ రాజ్ సహాయం చేస్తున్నాడంటూ మధుయాష్కి ఆరోపించారు. 

సత్యం కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించిన రామలింగరాజు కొడుకు తేజ్ రాజ్ మంత్రి కేటీఆర్ విదేశాల్లో దిగిన ఫోటోలను యాష్కి బైటపెట్టారు. కేసీఆర్ సంపాదించిన నల్లధనాన్ని విదేశాలను తరలించడంతో పాటు వాటి లావాదేవీలు చూసే బాధ్యతను తేజ్ రాజ్ తీసుకున్నాడని పేర్కొన్నారు. అందువల్లే కేటీఆర్ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి ఆయన వెంట తేజ్ రాజ్ ఉంటాడని అన్నారు. ముఖ్యంగా మలేసియాకు కేసీఆర్, కేటీఆర్ లు తమ అక్రమ సంపాదనను తరలిస్తున్నారని యాష్కి  ఆరోపించారు.

ఇలా కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం తెలంగాణలో దోచుకున్న డబ్బు విదేశాల్లో దాచుకుంటున్నారని మధుయాష్కి ఆరోపించారు. వారి బండారాన్ని మరిన్ని ఆధారాలతో త్వరలో బైటపెడతానని యాష్కి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

 ఆస్తులపై సంచలనం: కేటీఆర్ అసలు పేరు చెప్పిన యాష్కీ